యంగ్ డైరక్టర్ అనిల్ రావిపూడి తీసిన మూడు సినిమాలు హిట్ అయ్యాయి.అనిల్ ప్రస్తుతం ఎఫ్2 అనే సినిమాను తెరక్కెకిస్తున్నాడు.ఈ సినిమాలో సీనియర్ హీరో వెంకటేష్ యంగ్ హీరో వరుణ్ తేజ్ హీరోలుగా చేస్తున్న సంగతి తెలిసిందే.వెంకీ, వరుణ్‌ల మల్టీస్టారర్‌పై క్లారిటీ వచ్చేసింది. సినిమాను జూన్‌లో సెట్స్‌పైకి తీసుకెళుతున్నట్లు డైరెక్టర్ అనీల్ రావిపూడి ట్వీట్ చేశాడు. వెంకటేష్, వరుణ్ తేజ్‌తో ప్రాజెక్ట్ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నాడు. ట్వీట్‌తో పాటూ దిల్ రాజు, వెంకీ, వరుణ్‌తో దిగిన ఫోటోను కూడా ట్వీట్ చేశాడు అనిల్.
ఈ ట్వీట్‌పై ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. తాము కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నామంటున్నారు. దిల్ రాజు ప్రొడ్యూసర్‌గా ఈ తెరకెక్కుతున్న ఎఫ్‌కు ఫన్ అండ్ ఫ్రస్టేషన్ ట్యాగ్ లైన్ ఇచ్చారు.పూర్తిగా కామెడీ ఎంటర్‌టైనర్ స్టోరీ లైన్ ఉండబోతున్నట్లు వరుణ్ క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా మెహ్రీన్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాను దసరాకి తీసుకురావడానికి ప్రయత్నిస్తునట్లు తెలుస్తుంది.వెంకటేష్ పక్కన మిల్కీ బ్యూటీ తమన్నా చేస్తుందని సమాచారం.
Fun starts from this June.. …Can't wait to start shooting. #F2(Fun& Frustration)..#victoryvenkatesh garu. @IAmVarunTej @SVC_official 😀👍👍 pic.twitter.com/LH5WzzEFtv
— Anil Ravipudi (@AnilRavipudi) April 15, 2018