దగ్గుబాటి వారి ఇంట్లో త్వరలోనే పెళ్లి బజాలు మోగనున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ పెద్ద కూతురు ఆశ్రిత వివాహం మరి కొద్ది రోజుల్లో జరగనుంది. అయితే ఆమె పెళ్లి గురించి గత కొద్ది రోజులు నుంచి రకరకాల వార్తలు వస్తున్నాయి. అక్కినేని అఖిల్‌తో ఆశ్రిత పెళ్లి జరగనుందని వార్తలు వచ్చినప్పటికి అవి ఊట్టి రూమర్స్ అని తేలాయి. తాజాగా మరోసారి ఆశ్రితి పెళ్లిపై గాసిప్స్ మొదలైయ్యాయి.హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురెందర్ రెడ్డిగారి మనవడితో ఆశ్రిత పెళ్లి జరుగుతుందని అంటున్నారు.
మరి కొందరు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి దగ్గరి బంధువుల అబ్బాయితో ఆశ్రిత వివాహంజరుగుతుందని అంటున్నారు. పెళ్లి కొడుకు ఎవరు అనే దానిపై స్పష్టత లేదు.కాని పెళ్లి మాత్రం మార్చి,ఏప్రిల్ నెలలోఉంటుందని తెలుస్తోంది. సినిమా ఫీల్డ్, బిజినెస్ అండ్ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉండటంతో ఇరు కుటుంబాల నుంచే ఎవరో ఒకరితో ఆశ్రిత పెళ్లి జరగనుందని మాత్రం తెలుస్తుంది.ఇదే కనుక నిజం అయితే దగ్గబాటి కుటుంబంలో చాలారోజుల తరువాత పెళ్లి శుభాకార్యం జరగనుంది. అయితే ఆశ్రిత పెళ్లి ఎవరితో అనే దానిపై స్ఫష్టత రావాల్సి ఉంది. వెంకటేశ్ ప్రస్తుతం వెంకీ మామ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నాగచైతన్య వెంకటేశ్ అల్లుడుగా నటిస్తున్నాడు.ఈ సినిమాకు. జైలవకుశ ఫేం బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. రకుల్, శ్రియాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
- దళిత స్పీకర్ దూషణ, ఎర్రవల్లి ఘటనలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం!
- NZ VS INS: హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న మ్యాచ్ టికెట్లు!
- అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్ఎస్ సభ్యులంతా సస్పెండ్!
- యువతపై కేసులా? చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం!
- బిగ్‌బాష్ లీగ్ పై ఐపీఎల్ ఓనర్ల కన్ను!
