హీరో రానా సినిమాలలో కన్నా టీవీలలోనే ఎక్కువ కనిపిస్తున్నాడు.రానా నిర్వహించే నెం1 యారి అనే ప్రొగ్రామ్‌కు యాంకర్‌గా చేస్తున్నాడు రానా. మొదటి సీజన్ పూర్తి చేసుకున్న ఈ షో ఇటీవలే రెండో సీజన్‌ను ప్రారంభించాడు రానా.ఈ షోలో పలువురు సెలబ్రిటీలను తన షోకి తీసుకువచ్చి వారిని చిత్ర,విచిత్రంగా ఆడుకుంటాడు రానా.తాజాగా ఈ షోకి సీనియర్ హీరో రానా బాబాయ్ వెంకటేష్‌తో పాటు,మెగా హీరో వరుణ్ తేజ్‌లు అతిథులుగా వచ్చారు.ఈ షోలో రానా హడావిడి ఎక్కువ కనిపిస్తుంది.కాని వెంకీ ఎంట్రీతో ఈ షో స్వరూపం మొత్తం మారిపోయింది.రానా గేమ్‌లో భాగంగా ట్రూత్ ఆర్ డేర్ అని అడగడంతో ..వెంకీ ఇది స్క్రీప్ట్‌లో భాగమే కదా ..మరి దీనికి ఎందుకు ట్రూత్ ఆర్ డేర్ అని అడగడం అంటు రానాని ఆటపట్టించాడు.వెంకీ పక్కనే పెట్టుకుని వరుణ్‌ని నువ్వు వర్జిన్‌నేనా అని అడగడంతో పక్కనే ఉన్న వెంకీ షాక్ తిన్నారు.ఏంట్రా ఇది..ఇలా అడుగుతున్నావ్ అంటూ రానాని ప్రశ్నించారు.
ఇక వరుణ్ తేజ్ చేయకూడని పని చేస్తు నీ గర్ల్‌ఫ్రెండ్‌కు దొరికావు నిజమేనా అని వరుణ్ తేజ్ ను ప్రశ్నించాడు రానా.దీనికి కూడా వెంకీ తనదైన శైలీలో స్పందిస్తు …వరుణ్ తేజ్‌ను లేచి మరి హాగ్ చేసుకున్నాడు వెంకీ.ఇండస్ట్రీలో సాఫ్ట్ ఇమేజ్ ఉన్న హీరో ఎవరు అంటే వరుణ్ తేజ్ ఠక్కున నాగర్జున గారు అని చెప్పడంతో …వెంకీ ఖంగు తిన్నారు.బాబు బాబు ఇండస్ట్రీలో సాఫ్ట్ ఇమేజ్ నాకే ఉంది.అక్కడ శివ ,మాస్ అంటూ నాగర్జున సినిమా పేర్లు చెప్పారు వెంకీ. ఇక ప్రొమోలోనే ఈ ఎపిసోడ్ ఎలా ఉంటుందో చెప్పేశారు.ఈ ఎపిసోడ్ వచ్చే ఆదివారం ప్రసారం కానుంది.
- క్రైమ్ థ్రిల్లర్ చిత్రంతో నవాజుద్దీన్!
- 60 ఏళ్ల తర్వాతే ఆ సినిమా చేస్తా!
- మహేశ్ బాబుకు షాకిచ్చిన ఈడీ..
- పుష్ప 2..వీఎఫ్ఎక్స్ బ్రేక్‌డౌన్ వీడియో!
- డ్రగ్స్ రైడ్… మలయాళ నటుడు?
- ఈవారం థియేటర్ సినిమాలివే!