Thursday, May 16, 2024
- Advertisement -

దండుపాళ్యం 2.. ఇలా తీయడం అవసరమా..?

- Advertisement -

ఓ సినిమాని చాలా న్యాచుర‌ల్ తీస్తే.. అబ్బా అసలు ఏమన్న తీసారా సినిమాని.. చాలా న్యాచుర‌ల్ గా ఉందని అంటారు. అయితే ఆ న్యాచురాలిటీ మ‌రీ చూడ్డానికి ఎబ్బెట్టుగా ఉంటే ఏం చేయ‌లేం. ఇప్పుడు దండుపాళ్యం 2 విష‌యంలో ఇదే జ‌రిగింది. మూడేళ్ల కింద వ‌చ్చిన దండుపాళ్యం మూవీకి ఇది సీక్వెల్.

తొలి భాగం మాదిరే రెండో భాగం కూడా సంచలనం సృష్టిస్తోంది. తెలుగు డైరెక్టర్ శ్రీ‌నివాస్ రాజు తెర‌కెక్కించిన దండుపాళ్యం ఓ ముఠా క‌థ‌. హ‌త్య‌లు చేస్తూ.. అత్యాచారాలు చేస్తూ సాగిపోయే ఓ గ్యాంగ్ స్టోరీ ఇది. క‌ర్ణాట‌క‌లో ఈ మూవీ సృష్టించిన సంచ‌ల‌నం మాట‌ల్లో చెప్ప‌లేం. తెలుగులో కూడా దండుపాళ్యం ప‌ర్లేద‌నిపించింది. ఈ మూవీకి ఇప్పుడు సీక్వెల్ వ‌చ్చింది. శ్రీ‌నివాస్ రాజే ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. జులై 14న క‌ర్ణాట‌క‌లో విడుద‌లైంది దండు పాళ్యం 2 సినిమా. విడుద‌లైన రోజు నుంచే ఈ చిత్రంపై వివాదాలు కూడా మొద‌ల‌య్యాయి. అస‌లు ఇలాంటి సినిమా చేయ‌డానికి సిగ్గు లేదా అంటూ శ్రీ‌నివాస‌రాజుపై మండి ప‌డుతున్నారు కొంద‌రు.

ఇదో సినిమానా అస‌లు.. ఛీ ప‌ర‌మ‌నీచంగా ఉందంటూ మ‌రికొంద‌రు ద‌ర్శ‌కుడిపై ఫైర్ అవుతున్నారు. మ‌రోవైపు మేకింగ్ వీడియోస్ కూడా చాలా హాట్ గా హాట్ గా ఉన్నాయి. జైల్లో ఉన్న లేడీస్ లిప్ లాక్ సీన్ కూడా ఆసక్తి పుట్టిస్తోంది. ఇప్పుడు న్యూడ్ పిక్స్ విడుద‌ల‌య్యాయి. అవి సంజన‌వే అంటూ మ‌రో ప్ర‌చారం మొద‌లైంది. ఈ చిత్రంలో ఈమె పూర్తిగా డీ గ్లామ‌రైజ్డ్ పాత్ర‌లో న‌టించింది. ర‌విశంక‌ర్ మ‌రోసారి పోలీస్ పాత్ర‌లో న‌టించాడు. మొత్తానికి ఈ చిత్రం ఇప్పుడు క‌ర్ణాట‌క‌ను షేక్ చేస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -