Friday, March 29, 2024
- Advertisement -

కొబ్బరికాయ కొట్టేసిన ‘డియ‌ర్ కామ్రేడ్‌’

- Advertisement -

టాలీవుడ్ సన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్న డియ‌ర్ కామ్రేడ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. దీనికి సంబంధించిన అఫిషియ‌ల్ అనౌన్స్‌మెంట్ కూడా చేశారు చిత్ర యూనిట్‌. ఈ సినిమాలో హీరోయిన్‌గా ర‌ష్మిక మంద‌న న‌టిస్తోంది. గీతా గోవిందం వంటి బ్లాక్ బ్లాస్ట‌ర్ త‌రువాత వీరిద్ద‌రు క‌లిసి న‌టిస్తున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. దీనికి త‌గిన‌ట్లుగానే టీజ‌ర్‌లో లిప్ లాక్‌తో రెచ్చిపోయారు ఈ జంట‌.

డియర్ కామ్రేడ్ సినిమాను మైత్రి సంస్థతో బిగ్ బెన్ కలిసి సంయుక్తంగా నిర్మించింది. స్టూడెంట్ పాలిటిక్స్ లో సెన్సిబుల్ లవ్ స్టొరీని జోడించి ఓ విభిన్నమైన ప్రయత్నం చేసినట్టుగా ఇప్పటికే టాక్ ఉంది. భరత్ కమ్మ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ సినిమారు మే 31న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాతో విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న‌కు మ‌రో హిట్ వ‌స్తుంద‌ని గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నాడు. టాక్సీవాలా త‌రువాత విజ‌య్ దేవ‌ర‌కొండ నుంచి వ‌స్తున్న ఇదే కావ‌డంతో విజ‌య్ అభిమానులు ఈ సినిమాపై చాలానే ఆశ‌లు పెట్టుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -