Friday, May 17, 2024
- Advertisement -

బాబీ, లిల్లి ల అందమైన ప్రేమకథ ‘డియర్ కామ్రేడ్’

- Advertisement -

‘గీత గోవిందం’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న ‘డియర్ కామ్రేడ్’ అనే సినిమాతో మళ్లీ జంట గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈమధ్యనే టీజర్ మరియు పాటలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన దర్శక నిర్మాతలు తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ సినిమా ఎలా ఉండబోతోంది అని చెప్పకనే చెబుతోంది. బాబీ (విజయ్ దేవరకొండ) ఒక స్టూడెంట్ లీడర్. అతను తన చుట్టాలమ్మాయి లిల్లి( రష్మీక మందన్న) తో ప్రేమలో పడతాడు.

లిల్లి ఒక స్టేట్ లెవెల్ క్రికెట్ ప్లేయర్. మొదట్లో సాఫీగా సాగిన వాళ్ళ ప్రేమలో బాబీ కామ్రేడ్ అవ్వడం వలన కొన్ని ఇబ్బందులు వస్తాయి. కథ మూడేళ్ళు ముందుకు వెళ్లినా బాబీ లో మార్పు రాలేదని లిల్లి అనుకుంటుంది. అసలు వారి మధ్య ఏం జరిగింది? చివరికి ఏమైంది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై యష్ రంగినేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందిస్తున్నారు. జులై 26 వ తేదీన ఈ సినిమా తెలుగులో మాత్రమే కాక తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో కూడా విడుదల కాబోతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -