విజయ్ దేవరకొండ చేతిలో మూడు నుంచి నాలుగు సినిమాల వరకు ఉన్నాయి. డియర్ కామ్రేడ్ సినిమా విడుదల అయిపోవడం తో ఇక విజయ్ ఏ సినిమా ని ప్రేక్షకుల ముందుకు తీసుకొని వస్తాడు అనే విషయం పై చాలా సందిగ్ధత నెలకొంది. అయితే ఈ విషయం మీద మొత్తానికి ఈ హీరో క్లారిటీ ఇచ్చాడు. నేడు జరిగిన సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమాల విషయం లో ఒక స్టాండ్ తీసుకున్నాడు.
ముందుగా క్రాంతి మాధవ్ దర్శకత్వం లో చేస్తున్న సినిమా ని పూర్తి చేసాక నే కొత్త చిత్రాల జోలికి వెళ్తాను అని విజయ్ చెప్పేసాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలవడం, విజయ్ చాలా వరకు షూటింగ్ లో పాల్గొనడం కూడా జరిగిపోయింది. అందుకే ఈ సినిమా ని త్వరగా ముగించి, ఆ తర్వాత హీరో అనే కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టనున్నారు విజయ్.
తమిళం మరియు తెలుగు లో హీరో సినిమా ఒకేసారి విడుదల కానుంది. నోటా తర్వాత విజయ్ కి తమిళం లో ఇది రెండో సినిమా. ఒక నూతన దర్శకుడు ఈ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అంతే కాకుండా ఈ సినిమా ని కూడా మైత్రి నిర్మించనున్నారు.
