Friday, March 29, 2024
- Advertisement -

వివాదంలో విజ‌య్‌దేవ‌ర కొండ నోటా.. రిలీజ్‌పై నీలినీడ‌లు

- Advertisement -

హీరో విజయ్‌ దేవరకొండ నటిస్తున్న ‘నోటా’ చిత్రంపై వివాదం చోటు చేసుకుంది. స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని జ్ఞానవేల్‌ రాజ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ మూవీ తెలుగు రచన హక్కుల విషయంలో వివాదం చోటు చేసుకుంది.

విజయ్ దేవరకొండ జోడీగా మెహ్రీన్ .. సంచనా నటరాజన్ నటించారు. తెలుగు .. తమిళ భాషల్లో నిర్మితమైన ఈ సినిమాను, వచ్చేనెల 4వ తేదీన విడుదల చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. ఒప్పందాన్ని అతిక్రమించి తనను చిత్రం నుంచి తొలిగించారని రచయిత శశాంక్‌ వెన్నలకంటి పోలీసులను ఆశ్రయించాడు. చిత్ర నిర్మాత జ్ఞానవేల్‌ రాజాపై చెన్నై పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న నోటాకు సంబంధించి ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి. ఇటీవల రిలీజ్‌ అయిన టీజర్‌కు సూపర్బ్‌ రెస్పాన్స్‌ వస్తోంది.

తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఈ మూవీ టైటిల్‌పై కూడా వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో ఏదో ఒక పార్టీకి కాకుండా నోటాకు ఓటెయ్యమనేలా ప్రేరేపించేలా ఈ మూవీ టైటిల్ ఉందని సోషల్ మీడియా వేదికగా కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు.

ఇదిలా ఉంటే దీనికి మ‌రో కార‌ణం కూడా వినిపిస్తోంది. దసరా రోజుల్లోనే ‘అరవింద సమేత’ .. ‘హలోగురు ప్రేమకోసమే’ .. ‘పందెం కోడి’ సినిమాలు వస్తున్నాయి. ఆ పోటీని ‘నోటా’ ఎంతవరకూ తట్టుకుంటుందో చూడాలి మర

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -