Monday, May 6, 2024
- Advertisement -

విజ‌య్ దేవ‌ర‌కొండ ‘నోటా’ ట్రైల‌ర్‌

- Advertisement -

గీతా గోవిందం హిట్‌తో మంచి జోష్‌లో ఉన్నాడు విజ‌య్ దేవ‌క‌కొండ‌.ఈ సినిమా త‌రువాత అత‌ను  న‌టించిన‌ టాక్సీవాలా,నోటా సినిమాలు లైన్లో ఉన్నాయి.అంద‌రు ముందుగా టాక్సీవాలా సినిమా విడుద‌ల అవుతుంద‌ని భావించిన‌ప్ప‌టికి ఆ సినిమా రీ షూట్ చేయ‌డం వ‌ల్ల సినిమా ఆల‌స్యం అవుతుంది.దీంతో మొద‌ట ‘నోటా’ సినిమాను విడుద‌ల చేయ‌ల‌ని ఫిక్స్ అయ్యాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.దీనిలో భాగంగానే ఈ రోజు నోటా సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌.

ప్ర‌స్తుత రాజ‌కీయ‌ల‌పై సెటైర్‌గా తెర‌కెక్కుతున్న నోటా మూవీపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. ఓ యువ‌కుడు ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై చేస్తున్న పోరాటంగా నోటా సినిమా తెర‌కెక్కుతుంది.ఈ సినిమాలో విజ‌య్‌కు జంట‌గా మెహ్రీన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఆనంద్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను ద‌స‌రాకు విడుద‌ల చేయ‌ల‌ని భావిస్తున్నాడు.అర్జున్ రెడ్డి,గీతా గోవిందం సినిమాల‌తో హిట్ కొట్టిన విజ‌య్ నోటా సినిమా కూడా త‌న‌కు మ‌రో హిట్ ఇస్తుంద‌ని ధీమాగా ఉన్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -