Friday, March 29, 2024
- Advertisement -

చిరంజీవి-త్రివిక్రమ్ సినిమా లో లేడీ సూపర్ స్టార్?

- Advertisement -

మెగా స్టార్ చిరంజీవి ప్రధాన పాత్ర లో ఈ దసరా పండగ కి రానున్న చిత్రం సై రా నరసింహా రెడ్డి. ఈ సినిమా తర్వాత చిరంజీవి కొరటాల శివ దర్శకత్వం లో ఒక సోషల్ డ్రామా ని చేయనున్నారు. ఈ సినిమా లో హీరోయిన్ గా చాలా పేర్లు వినిపిస్తున్నాయి కానీ ఇప్పటి వరకు ఒక క్లారిటీ అయితే రాలేదు. ఇకపోతే ఈ సినిమా తర్వాత చిరంజీవి తాను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో నటించనున్నారు.

చిరంజీవి ఈ విషయాన్నీ వినయ విధేయ రామ సినిమా కి సంబందించిన ఇక ఈవెంట్ లో చెప్పారు. అయితే ఈ సినిమా లో కథ ఏంటి, చిరంజీవి పాత్ర ఎలా ఉండబోతుంది అనే విషయాల మీద ఇప్పటికీ ఒక క్లారిటీ రాలేదు.కానీ ఫిలిం నగర్ లో మాత్రం అప్పుడే ఈ సినిమా కి సంబందించిన హీరోయిన్ గురించి వార్తలు వస్తున్నాయి.

మహేష్ బాబు హీరో గా వస్తున్న సరిలేరు నీకెవరు చిత్రం తో రెండో ఇన్నింగ్స్ మొదలు పెడుతున్న విజయశాంతి ని ఈ చిత్రం లో కి తీసుకోవాలని త్రివిక్రమ్ ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత వరకు నిజం ఉందొ తెలియదు కానీ కాంబినేషన్ సెట్ అయితే మట్టుకు చాలా బాగుంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -