Sunday, May 4, 2025
- Advertisement -

‘సరిలేరు నీకెవ్వరు’ లో తన పాత్ర గురించి క్లారిటీ ఇచ్చిన విజయశాంతి

- Advertisement -

గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాలతో బిజీ గా ఉంటున్న లేడీ అమితాబ్ విజయశాంతి చాలా కాలం తరువాత మళ్ళీ సినిమాల లోకి రానున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా హాట్ట్రిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి రానున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో విజయశాంతి ఒక కీలక పాత్ర పోషించబోతున్నారు. అప్పట్లో హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ అయిన విజయశాంతి లాంటి నటి రీ-ఎంట్రీ ఎలా ఉండబోతోంది అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అయితే తాజాగా తన 53వ జన్మదినం సందర్భంగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడిన విజయశాంతి ‘సరిలేరు నీకెవ్వరూ’ మూవీలో తన పాత్ర ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చారు. సినిమాలో తనది నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని వినిపించిన వార్తలను ఆమె ఖండించారు. సినిమాలో తనది ఓ ముఖ్యమైన కీలకపాత్ర అని, అలా అని విలన్ రోల్ కాదు అని క్లారిటీ ఇచ్చారు. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర తాను చేయనని స్పష్టం చేసిన విజయశాంతి, మహేష్ పాత్ర కి తన పాత్ర కి మధ్య ఎటువంటి రిలేషన్ కూడా ఉండదు అని చెప్పి తాను మహేష్ తల్లిగా కనిపించట్లేదని ఇండైరెక్టు గా చెప్పారు. మరి సినిమాలో విజయశాంతి పాత్ర ఎలా ఉండబోతోందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -