Tuesday, April 30, 2024
- Advertisement -

విజయ్ తోనే మళ్ళీ మురుగదాస్.. ఏంటి బాసు ఇది..?

- Advertisement -

మురుగదాస్ సినిమాలు ఎంత వెరైటీ గా ఉంటాయో అందరికి తెలిసిందే.. తన సినిమా లో ఇంటలిజెన్స్ తో పాటు కమర్శియాలిటి కూడా యాడ్ చేసి ప్రేక్షకులకు మెచ్చే విధంగా సినిమా తీయడంలో మురుగదాస్ డిగ్రీ చేశాడని చెప్పొచ్చు.. ఎంతటి కష్టమైనా సీన్ ని అయినా తనదైన స్టైల్ లో సింపుల్ గా తీసి ఆడియెన్స్ వద్ద మార్కులు కొట్టేస్తాడు.. సౌత్ లోనే కాకుండా హిందీలో కూడా సినిమాలు చేసి అక్కడ కూడా మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.. తుపాకీ, గజినీ సినిమాలను అక్కడ రీమేక్ చేసి టాప్ డైరెక్టర్ లిస్టు లో చేరిపోయాడు..

ఇక తెలుగులో కూడా చిరంజీవి తో స్టాలిన్ సినిమా చేశాడు మురుగదాస్. ఆ తర్వాత చాల గ్యాప్ తర్వాత  మహేష్ తో స్పైడర్ సినిమా చేశాడు మురుగదాస్.. సినిమా అంతగా ఆడకపోయినా తన దర్శకత్వానికి కి మాత్రం  మంచి మార్కులు కొట్టేశాడు. మళ్ళీ తెలుగు సినిమా అయితే చేయలేదు..  అయితే ఇటీవలే సర్కార్ సినిమా తో సూపర్ హిట్ కొట్టిన మురుగదాస్ మళ్ళీ తనకు అచ్చొచ్చిన విజయ్ తోనే మరో సినిమా ను అనౌన్స్ చేశారు. దీంతో ఈ హీరో తో ఎన్ని సినిమాలు చేస్తావని సినీ ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు..

ఇప్పటికే విజయ్ తో మురుగదాస్ కత్తి,అదిరింది, సర్కార్ వంటి హిట్ సినిమాలు చేశాడు.. మధ్య మధ్య లో వేరే హీరో తో చేస్తున్నా మళ్ళీ మళ్ళీ విజయ్ తోనే మురుగదాస్ తో సినిమా లు చేయడంతో వెరైటీ కోరుకునే ప్రక్షకులు ఈ కాంబో ని చూసి బోర్ ఫీల్ అవుతున్నారట.. ప్రస్తుతం విజయ్ లోకేష్ కనకరాజన్ తో మాస్టర్ అనే సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా తర్వాత విజయ్ మురుగదాస్ తోనే సినిమా చేయనున్నాడట..సన్ పిక్చర్స్ నిర్మాణంలో సినిమా తెర కెక్కనుంది. 2008లోనే అతి పెద్ద విజయాలు సాధించిన మురుగదాస్ రాజమౌళి శంకర్ లా విభిన్న సినిమాలు తీయకుండా విజయ్ తో కమర్షియల్ సినిమాలకే పరిమితం అవుతున్నాడని ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -