- Advertisement -

విరాజి..మూవీ రివ్యూ

- Advertisement -

వరుణ్ సందేశ్ కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. ఈ మధ్యనే ‘నింద’ అనే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీతో అలరించిన అతను ఇప్పుడు ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో ‘విరాజి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేంద్ర నాథ్ కూండ్ల ‘ఎమ్3 మీడియా’ ‘మహా మూవీస్’ బ్యానర్ల పై ఈ చిత్రాన్ని నిర్మించారు. మరి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం రండి :

కథ :

ఓ పీచాసుపత్రి నేపథ్యంలో ఓ పది మంది వ్యక్తులు వివిధ కారణాలతో అక్కడికి వచ్చి, అక్కడినుంచి బయటకు వెళ్ళలేక, ఒకరి తర్వాత ఒకరు హత్యకు గురవుతుంటారు. ఈవెంట్ పేరుతో తమను మూసివేయ బడ్డ ఆ పిచ్చాసుపత్రికి వచ్చేలా చేశారని తెలుసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయేందుకు ప్రయత్నిస్తారు.ఆ టైంలో వరుణ్ సందేశ్ కూడా మిగతా వారి లాగే ఆ పిచ్చాసుపత్రి లోకి వస్తాడు. వరుణ్ సందేశ్ వచ్చిన తర్వాత ఆ పిచ్చి ఆసుపత్రిలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అసలు ఈ పదిమందిని ఆసుపత్రికి వచ్చేలా ప్లాన్ చేసింది ఎవరు?ఎందుకు చేశారు? రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి ఎవరు? చివరకు ఆ ఆ పిచ్చి ఆసుపత్రి నుంచి ఎవరైనా బయటపడ్డారా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు :

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ ఊహించని ట్విస్ట్‌లు, కథనం, క్లైమాక్స్ సీన్. ఆండీ పాత్రలో ఒదిగిపోయాడు వరుణ్ తేజ్. తన అద్భుత నటనతో ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాడు. నిడివి తక్కువ ఉండడం కూడా కలిసివచ్చింది. ఇక మిగితా నటీనటుల్లో సిఐ మురళిగా బలగం జయరాం, సెలబ్రిటీ ఆస్ట్రాలజిస్ట్ రామకృష్ణగా రఘు కారుమంచి ఇంప్రెస్ చేశారు. ముఖ్యంగా తనదైన కామెడీతో ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేశాడు రఘు. ప్రమోదిని, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, కుశాలిని పూలప, ప్రసాద్ బెహరా పర్వాలేదనిపించారు.

సాంకేతిక విభాగం:

ఎబెనైజర్ పాల్ నేపథ్య సంగీతం సినిమాకి మరో ప్లస్ పాయింట్‌గా మారింది. తనదైన బిజిఎంతో ఆకట్టుకోగా సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. నిర్మాణ విలువలకు వంక పెట్టలేం. ఎడిటింగ్ బాగుంది.

విశ్లేషణ:

సొసైటీలో ఇప్పుడున్న ఒక్క సమస్యను తీసుకొని, దానికి థ్రిల్లర్స్ సస్పెన్స్ అంశాలను జోడించి అద్భుతంగా సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. చివరి వరకు ట్విస్టులేవి రివిల్ చేయకుండా కథనాన్ని ఆసక్తికరంగా సాగించాడు. వేరువేరు నేపథ్యాలు ఉన్న పదిమంది ఒకే చోటికి రావడం.. వారిని అక్కడికి రప్పించిన వ్యక్తి ఎవరనేది ట్విస్ట్‌గానే ఉంచారు. ఇంటర్వెల్ వరకు సస్పెన్స్, థ్రిల్లర్ జానర్ లో కథనం సాగగా ఇంటర్వెల్ సీను అదిరిపోవడంతో పాటు సెకండాఫ్ పై ఆసక్తిని పెంచుతుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్టులు ఊహించని విధంగా ఉంటాయి. క్లైమాక్స్ లో వరుణ్ సందేశ్ తో వచ్చే సీన్ సినిమాకే హైలైట్.

రేటింగ్: 3.5/5

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -