తమిళ స్టార్ హీరో విశాల్ వరుస విజయాలు సాధిస్తు మంచి జోష్‌లో ఉన్న సంగతి తెలిసిందే. విశాల్‌కు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. విశాల్ నటించిన సినిమాలు తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల అవుతున్నాయి. ఇటీవల విశాల్ నటించిన పందెంకోడి-2 తెలుగులో కూడా హిట్ అయింది. ఇక విశాల్ తాజాగా నటించిన చిత్రం అయోగ్య. ఈ సినిమా యంగ్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమాకు రీమేక్.
తెలుగులో ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. తెలుగులో ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ యాక్టింగ్‌లోని మరో కోణాన్ని చూపించాడు పూరీ. తెలుగులో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను తమిళంలో విశాల్ హీరోగా అయోగ్య పేరుతో తెరకెక్కించారు. చాలాకాలం తరువాత విశాల్ ఓ రీమేక్ సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్. టీజర్‌ను చూస్తుంటే తెలుగు టెంపర్ సినిమాను అచ్చం దించేసినట్లుగా అనిపిస్తోంది.టీజర్ విశాల్ యాక్టింగ్ కూడా ఎన్టీఆర్‌ను ఫాలో అయినట్లుగానే కనిపిస్తోంది.
తెలుగులో కాజల్ హీరోయిన్‌గా నటించగా, తమిళంలో విశాల్ పక్కన హీరోయిన్‌గా రాశి ఖాన్నా నటిస్తోంది. ఇటీవలే టెంపర్ సినిమాను బాలీవుడ్‌లో రణవీర్ సింగ్ రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టాడు. బాలీవుడ్‌లో ఈ సినిమా 200 కోట్లు వరకు సాధించింది. తెలుగు, హిందీ భాషలలో ఘన విజయం సాధించిన ఈ సినిమా తమిళంలో విశాల్‌కు ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి. ఏప్రిల్ నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’
- ప్రియుడితో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల!
- అమరావతికి మోదీ..5 లక్షల మందితో సభ