తమిళ స్టార్ హీరో విశాల్‌కు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఓ సినిమా షూటింగ్‌లో ఫైట్ సీన్ చిత్రీకరిస్తుండగా ఆయన గాయపడినట్లు సమాచారం. విశాల్ ప్రస్తుతం తన కొత్త సినిమా కోసం టర్కీకి వెళ్లాడు. ఈ సినిమాకు సుందర్.సి దర్శకత్వం వహిస్తుండగా , తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్‌లో ఓ ఫైట్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా విశాల్ కాలు, చేయి విరిగినట్లు సమాచారం. కాలు, చేతికి బ్యాండేజ్ తో ఉన్న విశాల్ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. రిస్కీ ఫైట్ అయినప్పటికి ఎలాంటి డూప్ లేకుండా విశాల్ ఈ ఫైట్ చేయగంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
గతంలో ‘తుప్పరివాలన్’ సినిమా షూటింగ్ లో కూడా ఈ హీరో గాయపడ్డాడు. ఇక విశాల్ తాజాగా నటించిన ‘అయోగ్య’ సినిమా మే 10న ప్రేక్షకుల ముందు రానుంది. ఇందులో విశాల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతోంది. తెలుగులో ఎన్టీఆర్‌కు సూపర్ హిట్ ఇచ్చిన ఈ సినిమా తమిళంలో విశాల్‌కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
- Advertisement -
బైక్ యాక్సిడెంట్‌లో హీరో విశాల్‌కు తీవ్ర గాయాలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -