Monday, April 29, 2024
- Advertisement -

విశ్వక్సేన్… విశ్వాసమా, అతి విశ్వాసమా?

- Advertisement -

ఫలక్నూమా దాస్.. మలయాళం లో అంగమలీ డైరీస్ అనే పేరు తో వచ్చిన సినిమా కి తెలుగు లో రీమేక్ గా త్వరలో రానున్న చిత్రానికి టైటిల్ ఇది. వెళ్ళిపోమాకే, ఈ నగరానికి ఏమైంది సినిమాల తో ప్రేక్షకులని ఇంప్రెస్ చేసిన విశ్వక్సేన్ ఇందులో హీరో గా నటిస్తున్నాడు. విశేషమేంటి అంటే, ఈ సినిమా తో విశ్వక్ దర్శకుడి గా కూడా అరంగేట్రం చేస్తున్నాడు. ఈ సినిమా కి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, మరియు ట్రైలర్స్ జనాలని ఒక రేంజ్ లో ఇంప్రెస్ చేశాయి. ట్రైలర్ రిలీజ్ అయినా వెంటనే ఈ సినిమా కచ్చితం గా రికార్డ్స్ సృష్టించబోతోంది అని చెప్పిన వాళ్ళు చాలా మందే ఉన్నారు.

అయితే ఈ సినిమా మే 31 న విడుదల అవుతున్న తరుణం లో పంపిణీదారులు ఈ సినిమా కి పెయిడ్ ప్రీమియర్స్ ని ఈ నెల 30 రాత్రి న నిర్వహిస్తున్నారు. హైద్రాబాద్ లో ని చాలా థియేటర్ల లో ఈ సినిమా ని విడుదల చేస్తున్నారు. అంటే ఒక రోజు ముందు గా నే భాగ్యనగర వాసులు ఈ సినిమా ని తిలకించవచ్చు. అయితే ఈ మధ్య కాలం లో స్టార్ హీరోలు సైతం అనవసరం గా డివైడ్ టాక్ వస్తుంది అనే ఆలోచన తో ఈ పెయిడ్ ప్రీమియర్స్ కి దూరం గా ఉంటున్నారు. ఇంతకు ముందు కేవలం అర్జున్ రెడ్డి మరియు బాహుబలి కి మాత్రమే ఇలా ప్రీమియర్స్ వేశారు. కానీ ఫలక్నూమా దాస్ సినిమా యూనిట్ మాత్రం సినిమా కి కచ్చితం గా మంచి టాక్ వస్తుంది అనే నమ్మకం తో ఉన్నారు.

ఇది విశ్వాసమా, అతి విశ్వాసమా అనేది మరి కొద్దీ రోజులు ఆగితే మనకి తెలిసిపోతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -