ఫిబ్రవరిలో సాయిధరమ్, వరుణ్‌తేజ్ సినిమాలు
సంక్రాంతి సినిమా పండుగ తర్వాత మళ్లీ అంతటి పోటీ మెగా హీరోల మధ్యనే రాబోతోంది. ఫిబ్రవరి నెలలో ఇద్దరు యువ నటుల సినిమాలు ఒకే రోజు వచ్చేలా కనిపిస్తోంది. ఈ విధంగా వస్తే మాత్రం మెగా అభిమానులకు పండుగే. ఫిదా సినిమాతో మంచి విజయం అందుకున్న వరుణ్‌తేజ్, జవాన్ సినిమాతో పరాజయంలో ఉన్న సాయిధరమ్ తేజ్ ఇద్దరు ఒకే సారి సినిమాలతో థియేటర్లకు వస్తామంటున్నారు.
ఒకే కుటుంబం నుంచి వచ్చిన నటులు మాత్రం తమ సినిమాలతో పోటీకి దిగుతున్నారు. ఫిబ్రవరిలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్నసినిమా తొలిప్రేమ. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను ఫిబ్రవరి 9న విడుదల చేస్తున్నట్టుగా చిత్రబృందం ప్రకటించింది. అయితే అదే రోజు వినాయక్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అదే జరిగితే ఇద్దరు మెగా హీరోలు ఒకే రోజు బరిలో నిలుస్తారు. మరి మెగా హీరోలు పోటికి సై అంటారో లేక.. ఎవరో ఒకరు సర్థుకు పోతారో చూడాలి.
https://www.youtube.com/watch?v=LGY94Ww1dsM