Monday, April 29, 2024
- Advertisement -

మార్లిన్ మన్రో చిత్రానికి రూ. 1521 కోట్లు..!

- Advertisement -

హాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్.. అప్పటికీ..ఇప్పటికీ కుర్రకారు గుండెల్లో సెగలురేపే సెక్స్ అప్పీల్ మార్లిన్ మన్రో. ఆమె చనిపోయి ఆరుదశాబ్దాలు గడుస్తున్నా క్రేజ్ మాత్రం కొంచెంకూడా తగ్గలేదు. చిన్నవయసులోనే జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన మన్రో.. 36 ఏళ్ల వయసులోనే మరణించారు. మన్రో వస్తువులు ఎప్పుడు వేలానికి పెట్టినా ఆమె అభిమానులు ఎగబడి మరీ సొంతంచేసుకుంటుంటారు.

తాజాగా క్రిస్టీ సంస్థ మన్రో చిత్రం వేలానికి పెట్టబోతోంది. పాప్ గాయకుడు అండీ వార్హోల్ ఈ చిత్రాన్ని గీశారు. ఈ అరుదైన చిత్రం రూ. 1521 కోట్ల రికార్డు ధర పలుకుతుందని అంచనా వేస్తున్నారు. క్రిస్టీ సంస్థ అనుకున్నంత ధరగనక పలికితే ఇది ఈ శతాబ్దంలోనే అతిఖరీదైన చిత్రంగా నిలవనుంది. జూలియన్స్ ఆక్షన్ అనేసంస్థ హాలీవుడ్ లో ప్రముఖులు వాడిన వస్తువులను వేలానికి పెడుతుంది.

ఈ సంస్థ మన్రో వస్తువులను గతంలోకూడా వేలంవేసింది. మన్రో మాజీ భర్త జో డిమాగ్గియా ఆమెకు రాసిన ప్రేమలేఖ… వేలంలో 48 లక్షలు పలకగా… మన్రో మరో భర్త ఆర్థర్ మిల్లర్ రాసిన లవ్‌లెటర్ 28 లక్షలకు అమ్ముడుపోయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -