Wednesday, May 15, 2024
- Advertisement -

అయ్యా! మరి ఇది కేసిఆరా, వీరప్పనా!?

- Advertisement -

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ అంటేనే వివాదాలకు మారు పేరు అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. అలా వివాదాలలో ఎప్పుడు మునిగి ఉండే వర్మ  తాజాగా విడుదల చేసిన పోస్టర్ సంచలనాలకు తెర తీస్తోంది.

అదేంటంటే గంధపు చెక్కల స్మగ్లింగ్‌ చేయడంలో జాతీయ స్థాయిలో పేరొందిన వీరప్పన్ జీవితాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కుతున్న చిత్రం ’కిల్లింగ్ వీరప్పన్’. ఇప్పటికే ఈయన సినిమాలు రిలీజ్‌కు సిద్దంగా ఉన్నాయి. అలానే పలు భాషల్లో వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇలా ఉన్న తరుణంలో కిల్లింగ్ వీరప్పన్ అనే సినిమాను ప్రారంభించాడు. ఈ సినిమాను అన్ని భాషలలో విడుదల చేయనున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా ఇప్పటివరకు రామ్‌ గోపాల్ వర్మ ట్వీట్ చేసిన విధానం ప్రకారం కేసిఆర్‌ను టార్గెట్ చేస్తూ ఇలియానా కన్నా కేసిఆర్ సెక్సీగా ఉంటారని స్వయంగా తనే ట్వీట్ చేశాడు. ఈ మధ్య కాలంలో  ఓటుకు నోటు కేసు వ్యవహారం తెలుగు రాష్ట్రాల మధ్య అత్యంత కీలకంగా మారిన తరుణంలో కూడా చంద్రబాబును టార్గెట్ చేస్తూ కేసిఆర్‌ను ముక్కు సూటి మనిషిగా వ్యవహరిస్తున్నాడని తనదైన శైలిలో పొగుడుతూ ట్వీట్ చేశారు.

కానీ ఇప్పుడు వర్మ తాజాగా  తెరకెక్కిస్తున్న ’కిల్లింగ్ వీరప్పన్’ చిత్ర పోస్టర్లు వర్మ తన అఫీసియల్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఈ పోస్టర్లు కొన్ని కోణాల్లో(యాంగిల్స్‌లో) తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ను పోలి ఉన్నాయని ఆయన వివాదాలకోసం, కావాలని పబ్లిసిటీ కోసం ఇలా పోస్ట్ చేస్తారు అని మీడియాలో కథనాలు చేస్తున్నారు.

ఈ పోస్టర్ ఇంకా ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి. 

  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -