వివాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఇప్పటికే ఈ సినిమా గురించి అందరు మాట్లాడుకునేలా చేసిన వర్మ , తాజాగా ఈ సినిమా గురించి మరో అప్డేట్‌ను ప్రేక్షకులకు అందించాడు. వెన్నుపోటు సాంగ్‌తో గతంలో హల్ చల్ చేసిన రామ్ గోపాల్ వర్మ, తాజాగా ఎన్టీఆర్ వర్థంతి సందర్బంగా తన సినిమాలో ఎన్టీఆర్ రోల్‌ను బయట పెట్టాడు.
ఎన్టీఆర్ వర్థంతి రోజునే లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో ఎన్టీఆర్ పాత్రను పరిచియం చేస్తు ఓ వీడియోను విడుదల చేశాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ లో ఇదివరకే లక్ష్మి పార్వతికి సంబందించిన పాత్రను అలాగే చంద్రబాబు పాత్రను రివీల్ చేసిన సంగతి తెలిసిందే. అవి వైరల్ అయ్యే లోపే ఇప్పుడు సరికొత్త వీడియోతో ఆర్జీవీ మరో టాపిక్ కు శ్రీకారం చుట్టాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో ఎన్టీఆర్ చివరి దశలో లక్ష్మి పార్వతి ప్రవేశించిన అనంతరం ఎలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి అనే అంశాలను వర్మ చూపించనున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర కోసం ఓ స్టేజ్ ఆర్టిస్ట్‌ను ఎంపిక చేసుకున్నాడు వర్మ.
ఎన్టీఆర్ పాత్రలో స్టేజ్ ఆర్టిస్ట్‌ను ఎంపిక చేయడంపై కొందరు తప్పుపడుతుండగా, మరి కొందరు సమర్ధిస్తున్నారు. అచ్చం ఎన్టీఆర్‌లాగానే ఉన్నాడని మరి కొందరు అనడం విశేషం. ఏది ఏమైనప్పటికి బాలకృష్ట తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ కన్నా వర్మ తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్‌కే ఎక్కువ పబ్లిసిటీ వస్తోంది అనడంతో ఎటువంటి సందేహం లేదు. మరి రాబోవు రోజులలో లక్ష్మీస్ ఎన్టీఆర్ ఇంకెన్ని సంచలనాలకు దారి తీస్తోందో చూడాలి.
- కేంద్రమంత్రి రామ్మోహన్‌కు భద్రత పెంపు
- నానికే పంచ్ ఇచ్చిన ఆ హీరోయిన్!
- OTT:షాకింగ్..ఒక్క ఎపిసోడ్‌కే రూ.480 కోట్లు!
- సిగరేట్..లిక్కర్ ఏది హానికరం!
- అమరావతి..ప్రజా రాజధానేనా!