నందమూరి తారాక రామారావు జీవిత కథ ‘కథానాయకుడు’ సినిమా నిన్న(బుధవారం) విడుదలైంది. సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కాని ఎన్టీఆర్‌గా బాలయ్య బాగా నటించారని మాత్రం ప్రశంసలు అందుతున్నాయి. సినిమాలో ముఖ్యమైన పాత్రలకు ప్రముఖ నటీ,నటులను తీసుకున్నాడు క్రిష్.కాని కథానాయకుడులో వైఎస్ఆర్ రోల్ కోసం పెద్దగా గుర్తింపు లేని ఆర్టిస్ట్‌ను తీసుకున్నాడు. బయోపిక్‌లో వైఎస్ఆర్ పాత్ర బాగా పండటంతో ,ఈ పాత్రలో నటించింది ఎవరని గూగుల్ లో వెతకడం మొదలుపెట్టారు.
వైఎస్సార్ పాత్రలో కనిపించిన నటుడి పేరు శ్రీతేజ్. గతంలో వంగవీటి సినిమాలో దేవినేని నెహ్రూగా నటించాడు. ఈ సినిమాలో శ్రీతేజ్ నటనకు మంచి పేరు వచ్చింది,కాని అవకాశాలు రాలేదు. తాజాగా ఈ బయోపిక్‌లో నటించే అవకాశం దక్కింది. సినిమాలోని ఓ సీన్‌లో చంద్రబాబు ఎన్టీఆర్‌కు వైఎస్ఆర్‌ను పరిచియం చేస్తు.. ఇతను నా స్నేహితుడని పరిచియం చేసే సీన్‌లో కనిపిస్తోంది వైఎస్ఆర్ పాత్ర.అయితే రెండో భాగం మహనాయకుడు సినిమాలో వైఎస్ఆర్ పాత్ర ఎక్కువ ఉండే అవకాశం ఉంది.
- కేంద్రమంత్రి రామ్మోహన్‌కు భద్రత పెంపు
- నానికే పంచ్ ఇచ్చిన ఆ హీరోయిన్!
- OTT:షాకింగ్..ఒక్క ఎపిసోడ్‌కే రూ.480 కోట్లు!
- సిగరేట్..లిక్కర్ ఏది హానికరం!
- అమరావతి..ప్రజా రాజధానేనా!