మహేష్-కొరటాల కాంబినేషన్‌లో వస్తున్న ‘భరత్ అనే నేను’ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సినిమా విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. నిర్మాత కూడా వారానికో పాట వదులుతూ ప్రేక్షకుల్లో అంచనాలను మరింత పెంచేస్తోంది. ముఖ్యమంత్రిగా మహేష్ బాబు నటిస్తుండగా..ఇతర ముఖ్యపాత్రలని శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, ఆమని, సితార పోషిస్తున్నారు.
ఐతే రాజకీయ నేపధ్యం ఉన్న సినిమా కావడంతో ఇందులో కొన్ని పదవులు కూడా కీలకంగా మారే అవకాశం కన్పిస్తోంది. ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న టీజర్ ని జాగ్రత్తగా వింటే ” హౌస్ లో ఉన్న వాళ్ల డౌట్స్ అన్నీ క్లియర్ అయితే విత్ యువర్ పర్మిషన్ ఐ విల్ టేక్ ఏ లీవ్ మేడమ్ స్పీకర్ ” అనే వ్యాక్యం పట్టుకోవచ్చు… అంటే ఇక్కడ స్పీకర్ పాత్రలో ఓ మహిళ నటిస్తుందనేది తెలుసుకోవచ్చు.
స్పీకర్ పాత్రలో ఎవరు నటిస్తున్నారనేదే ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. మరి ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు..డైలాగ్ విన్పిస్తున్నప్పుడు విజువల్ కనుక చూసినట్లైతే..అక్కడో లేడీ కూడా సీట్లో కూర్చుని కన్పిస్తుంది. ఆమే ఆమని అనేవాళ్లున్నారు..కానీ ఆమని ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా చేస్తుందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది.
అయితే స్పీకర్ క్యారెక్టర్ చేస్తున్నదెవరో ఊహిస్తే సినిమా జీవితంలో యాభైఏళ్ల కెరీర్ పూర్తి చేస్కున్న రమాప్రభ. హాస్యపాత్రలు, సహాయపాత్రలు చేయడంలో దిట్ట అయిన రమాప్రభకి ఇదో కీలక పాత్ర అని చెప్పాలి. ప్రస్తుత రాజకీయాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేయకుండా చోద్యం చూసే ఈ పాత్రలో ఆమె తీసుకునే నిర్ణయాలు సినిమాని మలుపు తిప్పుతాయంటున్నారు.