సాహో సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి స్టేజ్ కి వచ్చింది. మరి కొన్ని రోజుల్లో ఈ సినిమా కి సంబంధించిన షూటింగ్ పూర్తి అవబోతున్న తరుణం లో ఈ సినిమా కి సంబందించిన టీజర్ గురించి సర్వత్రా చర్చ జరుగుతుంది. ఇప్పటికే సినిమా కి సంబందించిన టీజర్ రెడీ అయింది అని చెప్పి ప్రమోషన్స్ టీమ్ ఫుల్ గా టీజర్ కి హైప్ తీసుకొని వస్తున్నారు. అయితే ఏ మేరకు ఈ టీజర్ సినిమా కి హెల్ప్ అవుతుంది అనే విషయం మాత్రం ఇంకా అర్ధం కాలేదు. కాకపోతే ఈ టీజర్ కి ఎవరు సంగీతం అందించారు అనే ఉత్కంఠ అందరిలో నూ ఉంది.
సినిమా మొదలు అయినప్పుడు శంకర్ ఏహ్సాన్ లాయ్ ఈ సినిమా కి సంగీతాన్ని సమకూరుస్తారు అని తెలిపినప్పటికి రిలీజ్ అయిన రెండు మేకింగ్ వీడియో లలో ఒక దానికి తమన్ తోటి మరొక దానికి గిబ్రాన్ తోటి సంగీతాన్ని అందింపచేసారు చిత్ర యూనిట్. ఆ తర్వాత వచ్చిన సినిమా పోస్టర్స్ మీద సంగీత దర్శకుల పేర్లు కనిపించకపోవడం తో శంకర్ ఏహ్సాన్ లాయ్ లను సినిమా నుండి తీసేసారా లేకపోతే డిజైనర్ చేసిన పొరపాటా లేకపోతే మరి ఇంకేం కారణం అనే విషయం మీద ఫిలిమ్ నగర్ లో చాలా ఆసక్తికర చర్చ నడిచింది. చివరికి వారే ఈ సినిమా నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించడం తో ఇప్పుడు టీజర్ కి సంగీత ఎవరు ఇచ్చారు అనే విషయం పై అంతటా ఆసక్తి నెలకొంది.
