Wednesday, May 7, 2025
- Advertisement -

అందుకే ‘ఎన్టీఆర్‌’లో న‌టించ‌న‌ని చెప్పాను – కీర్తి సురేష్‌

- Advertisement -

మ‌హ‌న‌టి ఒక్క‌ సినిమాతోనే హీరోయిన్ కీర్తి సురేష్ ద‌శ ,దిశ మారిపోయింది. తెలుగు,త‌మిళ రెండు భాష‌ల‌లో ఫుల్ డిమాండ్ ఏర్ప‌డింది కీర్తి సురేష్‌.ప్ర‌స్తుత‌నికి అయితే త‌మిళ ఇండ‌స్ట్రీనే టార్గెట్ చేసుకుంది కీర్తి సురేష్.అక్క‌డ విశాల్‌,ధ‌నుష్‌,విక్ర‌మ్‌,విజ‌య్ వంటి స్టార్ హీరోల‌తో న‌టిస్తు బిజీగా ఉంది.తాజాగా ఆమె న‌టించిన పందెం కోడి – 2 సినిమా తెలుగులో కూడా విడుద‌ల కానుంది.ఈ సినిమాకు సంబంధించిన ప్ర‌మోష‌న్‌లో పాల్గోన్న కీర్తి సురేష్,సినిమా విశేషాల‌తో పాటు టాలీవుడ్ గురించి కూడా ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన వాఖ్య‌లు చేసింది.పందెం కోడి – 2 సినిమా అంద‌రికి న‌చ్చుతుంద‌ని ,ఈ సినిమా నా పుట్టిన రోజున విడుద‌ల కావడం ఆనందంగా ఉంద‌ని తెలిపింది.

ఇక ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో సావిత్రి పాత్ర‌కు ఎందుకు నో చెప్పిందో కూడా ఈ స‌మావేశ‌లంలో వెల్ల‌డించింది కీర్తి సురేష్‌. ”మహానటి అనేది ఒక మ్యాజిక్. మళ్లీ నేను సావిత్రి పాత్రలో కనిపిస్తే అలా నటించగలనో లేదో కూడా తెలియదు. అందుకే ఆ పాత్రను మళ్లీ టచ్ చేయాలనుకోలేదు. సావిత్రి మాత్రమే కాదు.. ఇకపై బయోపిక్ సినిమాలు వేటిలోనూ నటించకూడదని నిర్ణయించుకున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఎన్టీఆర్ బయోపిక్ లో సావిత్రి పాత్రలో నిత్యామీనన్ కనిపిస్తుందని స‌మాచారం.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -