దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి వంటి హిస్టరికల్ ఫిల్మ్ తరువాత దర్శకత్వం వహిస్తున్న సినిమా RRR. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరి తన సినిమా కథ ఏంటో చెప్పేశాడు రాజమౌళి. ఈ వేదిక మీదనే RRRలో హీరోయిన్స్‌ను ఎనౌన్స్ చేశాడు రాజమౌళి. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ నటిస్తుంది.అయితే మొదట ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్లో మరో స్టార్ హీరోయిన్ అయిన శ్రద్ధా కపూర్‌ను సంప్రదించారట చిత్ర యూనిట్.
అయితే రాజమౌళి తన సినిమాకు బల్క్ డేట్స్ అడగడంతో సినిమాకు నో చెప్పిందట శ్రద్ధా. ఆమె నో చెప్పిన తరువాతే అలియాను సంప్రదించారట RRR టీం. శ్రద్ధా కపూర్ అలియా భట్ అంత బిజీగా కూడా లేదు. సాహో ఎలాగూ ఫినిషింగ్ స్టేజి లో ఉంది. తన భాగం దాదాపు పూర్తయినట్టే. ఇది కాకుండా బాలీవుడ్ మూవీస్ చిచొరేతో పాటు స్ట్రీట్ డాన్సర్ అనే మూవీ మాత్రమే శ్రద్ధ కమిట్ అయ్యింది. మరి శ్రద్ధా RRR ఆఫర్‌ను ఎందుకు రిజెక్ట్ చేసిందో తెలియాల్సి ఉంది. ఈ విషయంపై రాజమౌళి స్వయంగా ప్రకటిస్తే కానీ క్లారిటీ రాదు.
- Advertisement -
రాజమౌళి RRRకి నో చెప్పిన ప్రభాస్ హీరోయిన్..?
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -