Tuesday, April 30, 2024
- Advertisement -

వరల్డ్ కప్ వల్ల వాయిదా పడ్డ రామ్ సినిమా

- Advertisement -

ఈమధ్యనే ‘హలో గురు ప్రేమకోసమే’ సినిమా తో మరొక ప్లాప్ అందుకున్న హీరో రామ్ ఇప్పుడు డ్యాషింగ్ దర్శకుడిగా డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘ఇస్మార్ట్ శంకర్’ అనే సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఈ సినిమాతో రామ్ ఖచ్చితంగా మంచి హిట్ అందుకుంటాడని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంతకు ముందు ఈ సినిమా జూలై 12న విడుదల కాబోతోందని అధికారిక ప్రకటన వెలువడింది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ప్రస్తుతం క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్ లు జరుగుతుండడం వలన ఈ సినిమా వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఎలాగో జులై 14 కి వరల్డ్ కప్ అయిపోతుంది కాబట్టి ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాను జులై 18న విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. నిధి అగర్వాల్, నభ నటేష్ హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ సినిమా ని పూరి జగన్నాథ్ మరియు చార్మి సంయుక్తంగా పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ మరియు పూరి కనెక్స్ బ్యానర్ల పై నిర్మిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -