ర్యాంప్ వాక్ చేస్తు కిందపడబోయింది హీరోయిన్ యామీ గౌతమ్. ఫెయిర్ & లవ్లీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఆమెకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ క్రేజ్‌తోనే బాలీవుడ్ సినిమాలలో అవకాశాలను కొట్టేసింది. తెలుగులో కూడా నితిన్ హీరో కొరియర్ బాయ్ కల్యాణ్ సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. అల్లు శిరీష్ మొదటి సినిమా గౌరవంలో కూడా హీరోయిన్‌గా నటించింది ఈ భామ. విక్కీడోనర్ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది యామీ గౌతమ్. ఈ సినిమా ఆమెకు మంచి విజయాన్ని అందించింది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో యామీకి వరుస ఆఫర్లు వస్తున్నాయి.
ఇక ఈ భామ సోషల్ మీడియలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పడు తన సినిమాల గురించి సమాచారం అందిస్తు అభిమానులకు టచ్‌లో ఉంటోంది యామి. యామీ ముంబై లాక్మే ఫ్యాషన్ వీక్ తొలిరోజు ర్యాంప్ వాక్ తో అదరగొట్టేసింది. అయితే ఈ ర్యాంప్ వాక్‌లో కాలు జారి కిందపడబోయింది. హైహీల్స్ ఆమెను తెగ ఇబ్బంది పెట్టాయి. నేలపై వేలాడుతూ పొడవుగా ఉన్న తన డ్రెస్ కి హై హీల్స్ తాకి జారి పడబోయి తమాయించుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
- Advertisement -
ర్యాంప్ వాక్ చేస్తు కిందపడ్డ నితిన్ హీరోయిన్
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -