కె.జి.ఎఫ్
…. ఇప్పుడు ఎక్కడ చూసిని ఈ సినిమా గురించే చర్చించుకుంటున్నారు. కన్నడ స్టార్ హీరో యష్ నటించిన ఈ సినిమా గతవారం విడుదలైంది. కన్నడలోయష్ స్టార్ హీరో కావడంతో సినిమాను టాలీవుడ్, బాలీవుడ్‌లలో డబ్బింగ్ చేశారు. మొదటి ఈ సినిమాపై ఎవరు పెద్దగా ఆసక్తి చూపించలేదు. కాని సినిమా చూసిన ప్రతి ఒక్కరు సినిమా బాగుందని చెప్పడంతో థియోటర్లకు క్యూ కట్టారు జనాలు. కోలార్ బంగారు గనుల బ్యాక్ డ్రాప్ లో మాఫియా – బానిసత్వం కథతో తీసిన ఈ సినిమా అందరిని ఆకట్టుకుంటోంది.
బాలీవుడ్‌లో షారుఖ్ సినిమా కన్నాకె.జి.ఎఫ్
సినిమానే ఎక్కువ కలెక్ట్ చేసిందంటే ఈ సినిమా ప్రభావం ఎలా అర్థం చేసుకోవాలి. తాజాగా ఈ సినిమా 150 కోట్ల క్లబ్‌లో చేరిందని చిత్ర యూనిట్ ప్రకటించింది. నాలుగు రోజుల్లో 100కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరిన ఈ సినిమా తొలి వారం తర్వాత చక్కని ఊపుతో వసూళ్లు సాధిస్తోంది. ఈ సినిమాకు అమెరికాలో కూడా బ్రహ్మరథం కడుతున్నారు. అమెరికాలో 522848 డాలర్లు వసూలు చేసింది.
- క్రైమ్ థ్రిల్లర్ చిత్రంతో నవాజుద్దీన్!
- 60 ఏళ్ల తర్వాతే ఆ సినిమా చేస్తా!
- మహేశ్ బాబుకు షాకిచ్చిన ఈడీ..
- పుష్ప 2..వీఎఫ్ఎక్స్ బ్రేక్డౌన్ వీడియో!
- డ్రగ్స్ రైడ్… మలయాళ నటుడు?
- ఈవారం థియేటర్ సినిమాలివే!