కె.జి.ఎఫ్ …. ఇప్పుడు ఎక్కడ చూసిని ఈ సినిమా గురించే చర్చించుకుంటున్నారు. కన్నడ స్టార్ హీరో యష్ నటించిన ఈ సినిమా గతవారం విడుదలైంది. కన్నడలోయష్ స్టార్ హీరో కావడంతో సినిమాను టాలీవుడ్, బాలీవుడ్‌లలో డబ్బింగ్ చేశారు. మొదటి ఈ సినిమాపై ఎవరు పెద్దగా ఆసక్తి చూపించలేదు. కాని సినిమా చూసిన ప్రతి ఒక్కరు సినిమా బాగుందని చెప్పడంతో థియోటర్లకు క్యూ కట్టారు జనాలు. కోలార్ బంగారు గనుల బ్యాక్ డ్రాప్ లో మాఫియా – బానిసత్వం కథతో తీసిన ఈ సినిమా అందరిని ఆకట్టుకుంటోంది.
బాలీవుడ్‌లో షారుఖ్ సినిమా కన్నాకె.జి.ఎఫ్ సినిమానే ఎక్కువ కలెక్ట్ చేసిందంటే ఈ సినిమా ప్రభావం ఎలా అర్థం చేసుకోవాలి. తాజాగా ఈ సినిమా 150 కోట్ల క్లబ్‌లో చేరిందని చిత్ర యూనిట్ ప్రకటించింది. నాలుగు రోజుల్లో 100కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరిన ఈ సినిమా తొలి వారం తర్వాత చక్కని ఊపుతో వసూళ్లు సాధిస్తోంది. ఈ సినిమాకు అమెరికాలో కూడా బ్రహ్మరథం కడుతున్నారు. అమెరికాలో 522848 డాలర్లు వసూలు చేసింది.
- అభిమానుల ఎదుగుదలే నాకు నిజమైన ప్రేమ: చిరంజీవి
- రావణుడిగా సీఎం విజయ్.. అమ్మవారిగా త్రిష..!
- సినీ నటుడు బాలకృష్ణకు గాయం..
- ‘టాక్సిక్’ నుంచి ‘మనసాగదే..’ సాంగ్ రిలీజ్!
- సరికొత్త వార్ యాక్షన్ డ్రామా ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’!
- ది ఒడిస్సీ.. తొలి వీకెండే రూ.2,548 కోట్ల వసూళ్లు!
