- Advertisement -

రాజమౌళికి పోయిన పరువు తిరిగొస్తుందా..!

- Advertisement -

ఇన్ని రోజులూ రాజమౌళి అంటే తెలుగువాళ్లు గర్వించదగ్గ దర్శకుడు.. తెలుగు సినిమాకు ఒకానొక ఐకాన్.. బయటి ఇండస్ట్రీల వాళ్లకు తెలుగు సినిమా అంటే రాజమౌళినే గుర్తుకు వస్తాడు.. అన్నట్టుగా ప్రచారం జరిగింది. రాజమౌళి సినిమాలు హిట్ అయిన తీరును బట్టి.. బయటి భాషల్లో అవి రీమేక్ కావడాన్ని బట్టి ఇలాంటి ఇమేజ్ వచ్చింది.

మరి అలాంటి రాజమౌళి పరువు ఇప్పుడు పోయింది! ‘బాహుబలి’ సినిమా ప్రచారం కోసం వేసిన చిన్న ట్రిక్ ఇప్పుడు రాజమౌళిని ఇబ్బంది పెడుతోంది.

యూట్యూబ్ లో బాహుబలి టీజర్ డిలీట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ టీజర్ ను యూట్యూబ్ లో పెట్టి ఫేక్ లైక్స్ ను.. ఫేక్ వ్యూ నంబర్ ను డిస్ ప్లే చేశారనే కారణాన్ని చూపి యూట్యూబ్ ఆ వీడియోను డిలీట్ చేసింది. దీంతో యూట్యూబ్ లో బాహుబలి టీజర్ మాయం అయ్యింది. నిబంధనల విషయంలో గట్టిగా ఉండే యూట్యూబ్ ను ప్రసన్నం చేసుకోవడానికి.. చేసిన పొరపాటును సరిదిద్దుకోవడానికి బాహుబలిటీమ్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది!

మరి తిరిగి ఏదో విధంగా మళ్లీ టీజర్ ను నెట్ లో పెట్టించగలరేమో కానీ.. పోయిన పరువు అయితే తిరిగి రాదు. రాజమౌళి అండ్ టీమ్ తమ సినిమా విషయంలో ఫేక్ పబ్లిసిటీని కోరుకొన్నట్టు అందరికీ అర్థం అవుతోంది. అవసరం లేకపోయినా.. రాజమౌళి అండ్ కో అలాంటి పబ్లిసిటీ కోరుకొని ఈ టీమ్ నేషనల్ లెవల్లో నవ్వుల పాలు అవుతోంది. మరి ఈ డ్యామేజ్ ను ఎలా కంట్రోల్ చేసుకొంటారో! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -