- Advertisement -

కేవలం రూ. 6 కోట్ల బడ్జెట్.. 12 రోజుల్లోనే రూ. 830 కోట్ల వసూళ్లు!

- Advertisement -

ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలన్నా.. ఒక పూర్తి స్థాయి చలనచిత్రాన్ని నిర్మించాలన్నా వెనుక బలమైన సినీ నేపథ్యం ఉండాలి. లేదా కోట్లాది రూపాయల భారీ బడ్జెట్ అయినా చేతిలో ఉండాలనే నిబంధనలు నడిచేవి. కాలం మారుతున్న కొద్దీ సాంకేతికత సామాన్యుడికి సైతం అందుబాటులోకి రావడంతో ఆ పాత నిబంధనలన్నీ మెల్లమెల్లగా తుడిచిపెట్టుకుపోతున్నాయి. నేటితరం యువ దర్శకులు కేవలం తమలో ఉన్న అద్భుతమైన ప్రతిభను.. విభిన్నమైన సరికొత్త కథలను నమ్ముకుని ఇండస్ట్రీలోకి దూసుకువస్తున్నారు.

ఇదే విషయాన్ని నిజం చేస్తూ హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ యూట్యూబర్ కర్రీ బార్కర్ సరికొత్త మ్యాజిక్ సృష్టించారు. తాను స్వయంగా రాసుకున్న ఒక విలక్షణమైన స్క్రిప్ట్‌తో ఫిల్మ్‌మేకర్‌గా మారి హాలీవుడ్ ఇండస్ట్రీని సైతం ఆశ్చర్యపరిచారు. కర్రీ దర్శకత్వంలో వచ్చిన డెబ్యూ ఫీచర్ ఫిల్మ్ ‘అబ్సెషన్’ (Obsession) ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. కేవలం 12 రోజుల్లోనే ఈ సినిమా వసూళ్ల పరంగా అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త చరిత్ర లిఖించింది.

ఈ హారర్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాను కేవలం 0.75 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 6.25 కోట్లు) అతి తక్కువ బడ్జెట్‌తో నిర్మించారు. పరిమిత వనరులతో కేవలం 20 రోజుల్లోనే ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తి చేయడం విశేషం. అయితే థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని రేంజ్ లో విద్వంసం సృష్టిస్తోంది.

కేవలం 12 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 100 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 830 కోట్లు) భారీ గ్రాస్ వసూళ్లను సాధించి అంతర్జాతీయ ట్రేడ్ వర్గాలను సైతం నోరెళ్లబెట్టేలా చేసింది. పెట్టిన పెట్టుబడికి వంద రెట్లకు పైగా లాభాలను తెచ్చిపెడుతూ 2026లోనే అత్యంత భారీ లాభాలు ఆర్జించిన హాలీవుడ్ స్వతంత్ర చిత్రంగా ఇది అగ్రస్థానంలో నిలిచింది. ఈ అద్భుతమైన ఘనతతో గ్లోబల్ లెవెల్లో స్వతంత్ర చలనచిత్రాల (Independent Films) సత్తా ఏంటో మరోసారి రుజువైంది.

అమెరికా.. యూరప్ దేశాల్లో ఇప్పటికే హారర్ లవర్స్‌ను పిచ్చెక్కించిన ఈ సెన్సేషనల్ మూవీ.. ఇప్పుడు ఇండియాలో రిలీజ్ కావడానికి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఇండియన్ సెన్సార్ బోర్డు (CBFC) నుంచి క్లియరెన్స్ తెచ్చుకున్న ఈ సినిమా.. మన దేశంలోని ప్రముఖ మల్టీప్లెక్స్‌లలో స్పెషల్ నైట్ షోలతో విడుదల కాబోతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -