టాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా కొనసాగుతోంది. ఇప్పటికే వరుస బయోపిక్‌లు తెలుగు ఇండస్ట్రీలో తెరకెక్కుతున్నాయి. ఇటీవలే ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం కథానాయకుడు విడుదల కాగ, రెండో భాగం విడుదలకు రెడీ అవుతోంది. ఇక మరో బయోపిక్ కూడా విడుదలకు రెడీ అవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజకీయ జీవిత కథను సినిమాగా తెరకెక్కిస్తున్నారు.
ఆయన రాజకీయ జీవితాన్ని కీలక మలుపు తిప్పిన పాదయాత్ర ఆధారంగా ‘యాత్ర’ సినిమా తెరకెక్కుతోంది. వైఎస్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముటీ నటించగా కీలక పాత్రలో జగపతిబాబు ,అనసూయ, సుహాసిని ఇంకా ప్రముఖులు నటించారు.తాజాగా ఈ సినిమా సెన్సార్‌ను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ఎలాంటి కట్స్ చెప్పకుండా క్లీన్ యూ ఇచ్చినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేశారు. సినిమా పూర్తి నిడివి రెండు గంటల ఆరు నిమిషాలు వచ్చిందని తెలుస్తోంది.
ఇక సినిమా విషయానికి వస్తే ప్రతి వైఎస్ఆర్ అభిమాని మెచ్చేలా సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు విజయం సాధించాడని అంటున్నారు సెన్సార్ సభ్యులు. వైఎస్‌గా మమ్ముటీ బాగా నటించారని సెన్సార్ సభ్యులలో ఒకరు తెలిపారు. తన యాక్టింగ్‌తో మమ్ముటీ కొన్ని సీన్లలో కన్నీళ్లు తెప్పించినట్లు తెలుస్తోంది. మొత్తనికి ఈ సినిమా వైఎస్ఆర్ అభిమానులతో పాటు , ప్రేక్షకులను కూడా అలరిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాను వచ్చె నెల ( ఫిబ్రవరి ) 8న విడుదల చేయనున్నారు.
- ఆపరేషన్ సింధూర్.. దేశ పరిరక్షణకు ప్రతీక
- ఉగ్రవాది మసూద్ అజర్‌కి అదిరే దెబ్బ
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు