ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవత కథను సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో వైఎస్ఆర్ పాత్రను మళయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటిస్తున్నాడు. ఈ రోజు వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ‘నీళ్లు ఉంటే కరెంట్ ఉండదు. కరెంట్ ఉంటే నీళ్లు ఉండవు. రెండు ఉండి పంట చేతికొస్తే సరైన ధర ఉండదు. అందరూ రైతే రాజు అంటారు. సరైన కూడు, గుడ్డ, నీడ లేని ఈ రాచరికం మాకొద్దయ్యా.
మమ్మల్ని రాజులుగా కాదు..కనీసం రైతులుగా బతకనివ్వండి చాలు” అంటూ ఓ రైతు తమ బాధలను చెప్పుకునే సన్నివేశంతో టీజర్ మొదలైంది. ‘నేను విన్నాను.. నేనున్నాను’ అంటూ వైఎస్ పాత్రలో మమ్ముట్టి చెప్పే డైలాగ్ హైలైట్ గా నిలిచింది. టీజర్‌ను విడుదలకు ముందే పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్‌కు చూపించారు. పాదయాత్రలో ఉన్న ఆయన టీజర్‌ను చూసి ఓకే చేసిన తరువాతే విడుదల చేశారు. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.
- ఆపరేషన్ సింధూర్.. దేశ పరిరక్షణకు ప్రతీక
- ఉగ్రవాది మసూద్ అజర్‌కి అదిరే దెబ్బ
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు