- Advertisement -

క్రేజీ న్యూస్..’బాహుబలి 3′ అప్‌డేట్!

- Advertisement -

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి త్వరలోనే ‘బాహుబలి’ ఫ్రాంచైజీలో మూడవ భాగంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో ‘బాహుబలి: ది టార్చ్ బేరర్’ అనే డాక్యుమెంటరీ విడుదలైంది. భారతదేశపు అతిపెద్ద చిత్రాలలో ఒకటైన బాహుబలి షూటింగ్ సమయంలో తెరవెనుక ఏం జరిగిందనే విషయాలను ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి తదితరులు ఇందులో పంచుకున్నారు.

ఈ డాక్యుమెంటరీలోని ఒక ప్రత్యేక చర్చ సందర్భంగా రానా దగ్గుబాటి ‘బాహుబలి 3’ గురించి హింట్ ఇచ్చారు. నేను ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పవచ్చో లేదో నాకు తెలియదు కానీ రాజమౌళి, శోబు (నిర్మాత) ఇక్కడ లేరు కాబట్టి నా మనసులో ఉన్నది చెప్పేస్తాను. ప్రపంచం ఇంకా దీనికి సిద్ధంగా ఉందో లేదో నాకు తెలియదు కానీ, మున్ముందు మరిన్ని బాహుబలి సిరీస్ చిత్రాలు రాబోతున్నాయి అని రానా అనడంతో ప్రభాస్, అనుష్క శెట్టి నవ్వేశారు.

ఆ వెంటనే ప్రభాస్ తన మూడు వేళ్లను పైకెత్తి చూపించారు. దీంతో నెటిజన్లు అసలు ‘బాహుబలి 3’ నిజంగానే రాబోతుందా? అని చర్చించుకోవడం మొదలుపెట్టారు. అంతేకాకుండా డాక్యుమెంటరీ చివరి ఎపిసోడ్‌లో ప్రభాస్ ముగిస్తూ.. అండ్ ది లెగసీ కంటిన్యూస్ అని అనడం అందరి దృష్టిని ఆకర్షించింది.

‘బాహుబలి’ మొదటి భాగం జూలై 2015 లో విడుదలైంది. ఇందులో ప్రభాస్‌తో పాటు రానా దగ్గుబాటి, తమన్నా భాటియా, అనుష్క శెట్టి కీలక పాత్రలు పోషించారు. దీనికి సీక్వెల్ అయిన ‘బాహుబలి: ది కంక్లూజన్’ ఏప్రిల్ 2017 లో థియేటర్లలోకి వచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -