ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవేటెడ్ చిత్రం ‘AA23’ . ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి రోజుకోవార్త వైరల్‌గా మారుతోంది. తాజాగా నటుడు అల్లు అర్జున్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారని, ఇందులో భాగంగా ముంబైలో ఒక ట్రయల్ షూట్ కూడా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
అల్లు అర్జున్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం #AA23 ప్రారంభ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. అయితే ముంబైలో అల్లు అర్జున్‌తో టీమ్ నిర్వహిస్తున్న ఈ ట్రయల్ షూట్ ఫస్ట్-లుక్ కోసం కాదని, కేవలం సినిమాకు సంబంధించిన ఒక ముందస్తు పరీక్ష కోసమేనని సమాచారం.
ఇటీవలే ఈ చిత్ర సహ-రచయిత రత్నకుమార్ ఒక క్రేజీ అప్‌డేట్‌ను పంచుకున్నారు. సినిమాకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ శరవేగంగా జరుగుతోందని త్వరలోనే షూటింగ్ ప్రారంభించేందుకు టీమ్ సన్నద్ధమవుతోందని వెల్లడించారు. రత్నకుమార్ మాట్లాడుతూ.. ఇది ఒక పక్కా పాన్-ఇండియన్ సినిమా అవుతుంది. కేవలం స్టార్స్ లేదా కథా నేపథ్యం వల్ల మాత్రమే కాదు, ఈ కథకు అంతర్జాతీయ అప్పీల్ ( ఉంది. అల్లు అర్జున్ సార్ ఈ సినిమా చేస్తుండటంతో, మనకు కావలసిన విధంగా సినిమాను మలచడానికి అన్నీ సమకూరుతాయి. ఆయనతో చర్చలు జరపడం చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించింది. పనులు చాలా వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే ఆయనతో మూడు వారాల పాటు చర్చలు జరిపాం, మే రెండవ వారంలోనే పనులు ప్రారంభమయ్యాయి అని పేర్కొన్నారు.
