నందమూరి కల్యాణ్‌రాం కొత్త సినిమా నా నువ్వే. ఈసినిమా ఆడియో ఫంక్షన్ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది.ఇది కంప్లీట్ గా లవ్ స్టోరీ థీమ్ తోనే ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాలో కల్యాణ్ రాం పక్కన తమన్నా హీరోయిన్గా చేసింది. జయేంద్ర ఈ సినిమాకు జయేంద్ర దర్శకత్వం వహించారు.ఆ ఫంక్షన్లో తమన్నా మాట్లాడుతు నేను అమెరికా నుంచి 22 గంటలపాటు జర్నీ చేసి వచ్చాను. ఆయన చెబుతుంటే నా కళ్లు మూతలు పడిపోతున్నాయి. అయినా సరే ఆయన చెబుతున్న కథ మనసులోకి వెళ్లిపోతోంది.
‘చినికి చినికి పాట చిత్రీకరించే సమయంలో నాకు ఫీవర్. ముక్కులు కూడా కారిపోతున్నాయి. ఆ పాట అయ్యేసరికి కళ్యాణ్ రామ్ కు ఎందుకు జలుబు చేయలేదు అని ఆశ్చర్యం వేసింది’ అంటూ నవ్వేసింది తమన్నా.తనను కనీసం ఓ వంద సార్లు లిఫ్ట్ చేసి ఉంటాడని చెప్పుకొచ్చింది తమన్నా. ఈ పాటలో తమన్నా ,కల్యాణ్‌రాం ఇద్దరు ఓ రేంజ్లో రెచ్చిపొయారని వినికిడి. సినిమాలను ఈ నెల 25న విడుదల చేస్తున్నారు.