Saturday, May 10, 2025
- Advertisement -

ప‌వ‌న్‌ను అల్లు అర్జున్ క‌లిసే స‌మ‌యం వ‌చ్చిందా?

- Advertisement -

టాలీవుడ్‌లో మెగా ఫ్యామీలికి ప్ర‌త్యేక స్థానం ఉంది. కాని ఆ ఫ్యామీలిలో వారికి గొడ‌వ‌లు కూడా ఉన్నాయి.మెగా స్టార్ త‌మ్ముడిగా ఇండ‌స్ట్రీకి ప‌రిచియ‌మైనా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌రువాత కాలంలో ఎన‌లేని క్రేజ్ సంపాదించాడు.మెగా హీరోగానే ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన మ‌రో హీరో అల్లు అర్జున్ కుడా త‌క్కువ కాలంలోనే మంచి హీరోగా ఎదిగాడు.ఇప్పుడు వీరిద్ద‌రి గురించి ఎందుకు అనుకుంటున్న‌రా!ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు అల్లు అర్జున్ ఫాద‌ర్ అల్లు అరవింద్ అంటే ప‌డ‌దు.వీరిద్ద‌రు కొంచెం దూరంగానే ఉంటారు. ఈ సంగ‌తి ప‌వ‌నే స్వ‌యంగా వెల్ల‌డించిన సంద‌ర్బాలు కూడా ఉన్నాయి.మొదట్లో బ‌న్నీప‌వ‌న్ రీలేష‌న్‌షిప్ బాగానే ఉండేది. త‌రువాత కాలంలో బ‌న్నీ కూడా ప‌వ‌న్‌కు వ్య‌తిరేకంగా మారాడు.ఓ ఆడియో ఫంక్ష‌న్‌లో ప‌వ‌న్ గురించి చెప్ప‌మంటే చెప్ప‌ను బ్ర‌ద‌ర్ అని చెప్పి మెగా అభిమాన‌లకు షాక్ ఇచ్చాడు.

అప్ప‌టి నుండి ప‌వ‌న్ అబిమానులు బ‌న్నీని టార్గెట్ చేస్తు సోషల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేశారు.దాంతో వీరిద్ద‌రి మ‌ధ్య గ్యాప్ ఎక్కువైంది.బ‌న్నీ నా పేరు సూర్య సినిమా అత‌ని పుట్టిన రోజు సంద‌ర్బంగా డైలాగ్ విడుద‌ల చేశారు.దానిలో అల్లు అర్జున్ సౌత్ ఇండియా,నార్త్ ఇండియా, ఈస్ట్ ఇండియా, ఇన్ని ఇండియాలు లేవురా మ‌న‌కి ఒక‌టే ఇండియా అనే డైలాగ్‌తో వ‌చ్చాడు బ‌న్నీ. ఈ డైలాగ్ ప‌వ‌న్‌ను ఉద్దేశించే అని ప‌వ‌న్ అభిమానులు అనుకుంటున్నారు.ఎందుకంటే ప‌వ‌న్ పొలిటిక్స్‌లోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.దానిలో భాగంగా కేంద్ర ప్ర‌భుత్వం నార్త్ ఇండియాని ఒక‌లాగా , సౌత్ ఇండియాను ఒక‌లాగా చూస్తుంది కామెంట్ చేశాడు.ప‌వ‌న్‌ను టార్గెట్ చేసుకుని బ‌న్నీ ఈ డైలాగ్ చెప్పాడ‌ని చాలామంది అనుకున్నారు.ఇక దీంతో వీరు క‌లిసే చాన్స్ లేదంటు వార్త‌లు వ‌చ్చాయి.కాని వీరిద్ద‌రు క‌లిసే స‌మ‌యం వ‌చ్చింద‌ని రాంచ‌ర‌ణ్ అభిమాన‌లు అనుకుంటున్నారు.

ఎందుకంటే రాంచ‌ర‌ణ్ తాజాగా న‌టించిన చిత్రం ఇండ‌స్ట్రీ రికార్డులు సృష్టిస్తు దూసుకుపోతుంది.మొన్న ఈ మ‌ధ్యే చ‌ర‌ణ్ ప‌వ‌న్‌కు ప్ర‌త్యేక షో ద్వారా రంగ‌స్థ‌లం సినిమాను చూపించారు. ప‌వ‌న్‌కు సినిమా బాగా న‌చ్చ‌డంతో చిత్ర యూనిట్‌పై ప్ర‌శంస‌లు కురిపించారు.ఇప్పుడు రాంచ‌ర‌ణ్ రంగ‌స్థ‌లం సినిమా హిట్‌తో మంచి జోష్‌లో ఉన్నాడు.దీంతో అభిమానుల‌కు చిత్ర యూనిట్‌కు పెద్ద పార్టీ ఇవ్వ‌ల‌ని అనుకుంటున్నాడు.దీనికి చిరంజీవి నుంచి కూడా గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చింది.ఈ పార్టీకి మెగా ఫ్యామీలి మొత్తం రానుంద‌ని స‌మాచారం.ప‌వ‌న్ కూడా ఈ పార్టీకి వ‌స్తాన‌ని మాట ఇచ్చార‌ని తెలుస్తుంది.దీంతో ఈ పార్టీలో అల్లు అర్జున్‌,ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌లుసుకొనున్నారు.మ‌రి వీరిద్ద‌రి ఎదురుప‌డితే ఎలా బిహేవ్ చేస్తారో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -