Saturday, May 10, 2025
- Advertisement -

మ‌హేశ్- సుకుమార్ సినిమా టైటిల్ అదేనా..?

- Advertisement -

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు వ‌రుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. మ‌హేశ్ ప్ర‌స్తుతం త‌న 25వ సినిమా మ‌హ‌ర్షి షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డె న‌టిస్తోంది. ఈ సినిమా పూర్తి కాగానే త‌న తరువాత సినిమాకు షిఫ్ట్ అవుతాడు మ‌హేశ్‌. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేశ్ త‌న త‌రువాత సినిమా చేస్తున్నాడు. ఇప్ప‌టికే స్టోరీ సిద్దం అయిన‌ట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ ఒక‌టి బ‌య‌టికి వ‌చ్చింది.

సినిమా టైటిల్ ఇదేనంటూ సోష‌ల్ మీడియాలో ఓ వార్త వైర‌ల్ అవుతోంది.సుకుమార్ తన దగ్గర కో డైరెక్టర్‌గా ప‌నిచేసే వ్య‌క్తి ‘హర హర శంభో శంకర ‘అనే టైటిల్‌ను రిజిస్టార్ చేయించారు.దీంతో సినిమా టైటిల్ ఇదేనంటు అభిమానులు తెగ హ‌డవిడి చేస్తున్నారు. అయితే ఈ సినిమా టైటిల్ ఎంతో వ‌ర‌కు నిజ‌మో తెలియ‌దు. దీనిపై చిత్ర యూనిట్ ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. ఇటీవల మీడియా ముందుకొచ్చిన సుకుమార్ , మహేష్ తో సినిమా ఉంటుందని మే నెలలో షూటింగ్ మొదలుపెట్టబోతున్నట్లు వెల్లడించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -