గొల్లభామ పోయి గోరువంక, వినిపించని శివనాగులు గొంతు
గ్రామీణ నేపథ్యంలో సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన సినిమా ‘రంగస్థలం’. ఈ సినిమా మార్చి 30వ తేదీ విడుదలై రూ.వంద కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. వేసవి సినిమా పండుగకు మంచి బోణి ఏర్పడింది. ఈ సినిమా విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే ఈ సినిమా థియేటర్‌లోకి వచ్చింది. అయితే థియేటర్‌లో ప్రదర్శితమైన సినిమాలో మార్పులు చాలా ఉన్నాయి. వాటిని మీరు గమనించారా?
గొల్లభామ .. గోరువంక: రంగమ్మ మంగమ్మ పాటలో గొల్లభామ వినిపించలేదు. గొల్లభామ స్థానంలో గోరువంక నా గోరు గిల్లుతుంటే అని పాడారు. ఈ మార్పును ప్రేక్షకులు గమనించలేకపోయి ఉండవచ్చు. కానీ గొల్లభామ కాస్త గోరువంక అయ్యింది. తెలంగాణలోని యాదవ సంఘం నాయకులు గొల్లభామ అనే పదంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ పదం తొలగించకపోతే ఆందోళనలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు. అయితే వారి హెచ్చరికలను పట్టించుకోని సినిమా బృందం మేం ఆ పదం మార్చం.. అది ఒక పురుగు పేరు అని రచయిత చంద్రబోస్ స్పష్టం చేశారు. దర్శకుడు సుకుమార్ కూడా చెప్పాడు. అయితే థియేటర్‌లో విడుదలైన సినిమాలో మాత్రం గొల్లభామ పదం వినిపించలేదు. అయితే యాదవ నాయకులకు సినిమా బృందం భయపడినట్టు ఉంది. ఎందుకు వచ్చిన తలనొప్పి అని భావించి ఆ పేరు తొలగించినట్టు కనిపిస్తోంది.
శివనాగులు గొంతు: ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టునుంటావా అనే పాట కూడా మారింది. అయితే మారింది పాట కాదు గొంతు. ఈ పాటను మొదట జానపద కళాకారుడు శివనాగులుతో ఈ పాట పాడించారు. జానపద పాటకు జానపద కళాకారుడు పాట పాడడంతో సూపర్‌గా సెట్టయ్యింది. ఈ పాట అందరీ నోళ్లల్లో నాని సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే సినిమా విడుదలైన తర్వాత ఆ పాటకు శివనాగులు గొంతు లేదు. సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ గొంతు ఉంది. దీంతో ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురయ్యారు. శివనాగులు గొంతు లేకపోవడంతో సినిమాలో నాగన్న పాట ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.అయితే ఈ పాట విషయంలో వివాదం రేగె అవకాశం ఉంది. ఎందుకంటే శివనాగులుకు చెప్పకుండా సినిమాలో డీఎస్పీ గొంతు వాడడం నేరమే. దీనిపై చిత్ర బృందం ఏముంటుందో చూడాలి.