- Advertisement -

బీర్ బాటిల్‌లో కండోమ్ ప్యాకెట్

- Advertisement -

మద్యం ప్రియులను షాక్‌కు గురిచేసే ఘటన ఒకటి సిద్దిపేట జిల్లాలో వెలుగుచూసింది. సీలు వేసి ఉన్న ఓ ప్రముఖ బ్రాండ్ బీర్ బాటిల్లో ఏకంగా కండోమ్ ప్యాకెట్ దర్శనమివ్వడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బ్రాండెడ్ మద్యం బాటిళ్ల తయారీ, నాణ్యతా ప్రమాణాలపై ఈ ఘటన పలు అనుమానాలకు తావిస్తోంది.

సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట్ భూంపల్లి మండల కేంద్రంలోని ఓ వైన్స్ షాపునకు ఒక వినియోగదారుడు వెళ్లాడు. అక్కడ అతను ఒక ‘కింగ్ ఫిషర్’ బీర్ బాటిల్‌ను కొనుగోలు చేశాడు. అయితే, ఆ బీర్ తాగేందుకు సిద్ధమవగా.. బాటిల్ లోపల ఏదో వింత వస్తువు కనిపించింది. నిశితంగా గమనించిన సదరు వ్యక్తి, లోపల ఒక ఖాళీ కండోమ్ ప్యాకెట్ ఉండటం చూసి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. బాటిల్ సీల్ ప్యాక్ చేసి ఉన్నప్పటికీ లోపల అది ఎలా వచ్చిందో అర్థం కాక ఆశ్చర్యపోయాడు.

బాటిల్ లోపల కండోమ్ ప్యాకెట్ ఉన్న విషయాన్ని సదరు కస్టమర్ వైన్స్ షాప్ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లాడు. కంపెనీ సీలింగ్ లోనే ఈ తప్పు జరిగిందని, దీనిపై సమాధానం చెప్పాలని నిలదీశాడు. అయితే, వైన్స్ షాప్ యాజమాన్యం దీనిపై ఏమాత్రం బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో సదరు వినియోగదారుడికి ఆగ్రహం వచ్చింది.

దీంతో తోటి మద్యం ప్రియులు, వినియోగదారులు పెద్ద సంఖ్యలో వైన్స్ షాప్ ముందుకు చేరుకుని ఆందోళనకు దిగారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న మద్యం కంపెనీలపై, వైన్స్ షాపులపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. ఈ ఘటనతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతాము. సదరు బీర్ బాటిల్ ఏ బ్యాచ్‌కు చెందింది? ఎక్కడి నుండి సరఫరా అయింది? అనే కోణంలో తనిఖీలు చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం అని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -