- Advertisement -

హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా అరెస్ట్

- Advertisement -

హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా నగరంలోని కొండాపూర్ ప్రాంతంలో అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను ఈగల్ బృందం, గచ్చిబౌలి పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు చేపట్టిన దాడుల్లో ఓ ప్రధాన డ్రగ్ పెడ్లర్‌తో పాటు మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 32 గ్రాముల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన డ్రగ్స్ విలువ లక్షల్లో ఉంటుందని అధికారులు తెలిపారు.

పోలీసుల విచారణలో ఈ ముఠా బెంగళూరు, గోవా వంటి నగరాల నుంచి కొకైన్ కొనుగోలు చేసి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు బయటపడింది. ముఖ్యంగా నగరంలోని ఐటీ కారిడార్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. జల్సాల కోసం, త్వరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ నిందితులు డ్రగ్స్ వ్యాపారంలోకి దిగినట్లు పోలీసులు వెల్లడించారు.

అత్యంత గోప్యంగా డ్రగ్స్ సరఫరా చేయడానికి ‘డెడ్ డ్రాప్’ పద్ధతిని ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. కస్టమర్లకు ప్రత్యక్షంగా ఇవ్వకుండా, ముందుగా నిర్ణయించిన ప్రదేశంలో డ్రగ్స్ ఉంచి, తరువాత సమాచారం ఇచ్చే విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో మరికొంతమంది సంబంధితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. నగరంలో డ్రగ్స్ నెట్‌వర్క్‌పై కట్టడి చేసేందుకు ప్రత్యేక బృందాలు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -