ఘోర విషాదాలు.. 31 మంది దుర్మరణం!

నవరాత్రి వేడుకల సమయంలో దేశంలో వరుస విషాదకర ఘటనలు తీవ్ర కలకలం రేపాయి. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ లారీ భక్తులపైకి దూసుకెళ్లగా.. మరోవైపు పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని దుర్గా పూజ మండపంలో జరిగిన తొక్కిసలాటలో పలువురు ప్రాణాలు కోల్పోయారు.

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో శీత్లామాత ఆలయం దగ్గర శనివారం అర్ధరాత్రి దాటాక ఘోర ప్రమాదం జరిగింది. చినోర్ వైపు నుంచి ధాన్యం లోడుతో వస్తున్న ఒక ట్రక్కు సడన్‌గా అదుపుతప్పింది. రోడ్డుపై ఉన్న బారికేడ్లు, ఆలయ మెయిన్ గేట్, గోడను ధ్వంసం చేస్తూ నేరుగా భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ యాక్సిడెంట్‌లో 12 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. డ్యూటీలో ఉన్న ఇద్దరు పోలీసులకు కూడా సీరియస్ గాయాలయ్యాయి. నవరాత్రుల టైమ్‌లో అక్కడ బారికేడ్లు, పోలీస్ చెక్ పోస్ట్ ఉన్నప్పటికీ లారీ లోపలికి ఎలా వచ్చిందనే దానిపై అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు.

అదే రోజు రాత్రి కోల్‌కతాలోని చోర్‌బగాన్‌ సర్బజనీన్‌ దుర్గా మండపం దగ్గర ఊహించని ప్రమాదం జరిగింది. మండపంలో జరిగిన తొక్కిసలాట (stampede) ఘటనలో 13 మంది మహిళలు, ఒక చిన్నారితో సహా మొత్తం 19 మంది చనిపోయారు. మరో 25 మంది గాయపడటంతో వారిని ఇమ్మీడియట్‌గా హాస్పిటల్‌కి తరలించారు.

ఉత్తర కోల్‌కతాలోని శారదా పార్కు దగ్గర ఉన్న ఈ పందిరిలో రాత్రి 7:40 గంటల టైమ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వీకెండ్ కావడంతో జనం విపరీతంగా వచ్చారు. దీనికి తోడు వర్షం పడటం, ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లు చాలా ఇరుకుగా ఉండటంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. జనమంతా బయటకు వెళ్లే ఎగ్జిట్ వైపు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఆ ఏరియ అంతా చీకటిగా ఉండటంతో పాటు ముందు ఇద్దరు చిన్న పిల్లలు కిందపడిపోయారు. వాళ్ళపై పడిపోవడంతో పరిస్థితి అదుపుతప్పి తొక్కిసలాట జరిగింది.

ఈ దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, వైస్ ప్రెసిడెంట్ సీపీ రాధాకృష్ణన్, ప్రధాని మోదీ తీవ్రంగా సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు పీఎం నేషనల్ రిలీఫ్ ఫండ్ నుంచి రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50,000 ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఆ టైమ్‌లో కోల్‌కతాలోనే ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఇన్సిడెంట్ పట్ల షాక్ గురయ్యారు. బాధితులను పరామర్శించేందుకు ఆయన తన షెడ్యూల్డ్ ప్రోగ్రామ్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకున్నారు.