ఈ టీ20 వరల్డ్ కప్ స్కాట్లాండ్కు ఉహించని సవాల్‌గా మారింది. అనూహ్యంగా బంగ్లాదేశ్ జట్టు వరల్డ్ కప్ నుండి తప్పుకోవడంతో స్కాట్లాండ్కు అవకాశం రాగా ఎలా రాణిస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొత్త హెడ్ కోచ్ ఓవెన్ డాకిన్స్ బాధ్యతలు చేపట్టి ఇంకా కొన్ని వారాలే కావడం కూడా ఒక అంశం. అయితే కెప్టెన్ రిచీ బెరింగ్టన్ నేతృత్వంలోని కోర్ జట్టు పెద్ద వేదికలకు కొత్తది కాదు. 2021లో సూపర్-12 దశకు చేరిన జట్టులోని తొమ్మిది మంది ఈసారి కూడా ఉన్నారు.
తక్షణంలో అందుబాటులో ఉన్నవారితోనే జట్టు ఎంపిక జరిగింది. ఇంగ్లాండ్ తరఫున ఆడిన స్కాట్ కరీ అర్హత కోల్పోయాడు. క్రిస్ సోల్ ఇతర వృత్తిపరమైన బాధ్యతల కారణంగా లేరు. అయితే డాకిన్స్ నమ్మకాన్ని చూపిస్తూ ఫిన్లే మెక్‌క్రీత్, ఒలీ డేవిడ్సన్, జైనుల్లా ఇహ్సాన్లకు చోటు దక్కింది. స్పిన్ విభాగంలో మార్క్ వాట్ నాయకత్వంలో మైఖేల్ లీస్క్, క్రిస్ గ్రీవ్స్ ఉన్నారు. బ్యాటింగ్‌లో మైఖేల్ జోన్స్, టామ్ బ్రూస్ బలం చేకూర్చారు.
స్కాట్లాండ్ ఎక్కువ టీ20లు ఆడలేదు. గత వరల్డ్‌కప్ తర్వాత యూరప్ వెలుపల టీ20 మ్యాచ్ ఆడలేదు. ఆస్ట్రేలియాతో హోం సిరీస్‌లో భారీ ఓటముల తర్వాత, తొమ్మిది నెలల విరామం వచ్చింది. యూరోపియన్ క్వాలిఫయర్‌లో ఇటలీ, జెర్సీ చేతిలో ఓడిపోయి నాలుగో స్థానానికి పరిమితమయ్యారు. ఇప్పుడు దక్కిన అవకాశం ఆలస్యంగా రావడంతో సరైన సిద్ధతకు సమయం దొరకలేదు.
స్కాట్లాండ్ ఫిబ్రవరి 7న వెస్టిండీస్‌తో ఫిబ్రవరి 9న ఇటలీ,ఫిబ్రవరి 14న ఇంగ్లాండ్,ఫిబ్రవరి 18న నేపాల్‌తో తలపడనుంది.
స్కాట్లాండ్ జట్టు:
రిచీ బెరింగ్టన్ (కెప్టెన్), మాథ్యూ క్రాస్ (వికెట్ కీపర్), జార్జ్ మున్సీ, మైఖేల్ జోన్స్, టామ్ బ్రూస్, బ్రాండన్ మెక్మల్లెన్, ఫిన్లే మెక్‌క్రీత్, మైఖేల్ లీస్క్, మార్క్ వాట్, క్రిస్ గ్రీవ్స్, సఫ్యాన్ షరీఫ్, బ్రాడ్లీ కరీ, ఒలివర్ డేవిడ్సన్, జైనుల్లా ఇహ్సాన్, బ్రాడ్లీ వీల్.
ట్రావెలింగ్ రిజర్వ్స్: జాస్పర్ డేవిడ్సన్, జాక్ జార్విస్.
నాన్-ట్రావెలింగ్ రిజర్వ్స్: మెకెంజీ జోన్స్, క్రిస్ మెక్‌బ్రైడ్, చార్లీ టియర్.
