- Advertisement -

కన్నతల్లే.. కూతురిని కొట్టి చంపి..!

- Advertisement -

మాట వినట్లేదనే కోపంతో.. కన్నతల్లే కుటుంబ సభ్యులతో కలిసి కూతురిని అత్యంత కిరాత‌కంగా కడతేర్చిన షాకింగ్ ‘పరువు హత్య’ (Honor Killing) ఉదంతం శ్రీకాకుళం జిల్లా టెక్కలి పరిధిలో వెలుగుచూసింది. మొదట గుండెపోటు, ఆత్మహత్య అంటూ నాటకమాడి శవాన్ని కూడా దహనం చేసిన నిందితుల గుట్టును పోలీసులు పక్కా ఆధారాలతో రట్టు చేశారు. ఈ భయంకర హత్య కేసు వివరాలను టెక్కలి డీఎస్పీ డి.లక్ష్మణరావు విలేకరుల సమావేశంలో అధికారికంగా వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టెక్కలి మండలం సొర్లిగాం గ్రామానికి చెందిన దుంపల హరిణికి 2020లో ఆమె మేనమామ, సచివాలయ ఉద్యోగి అయిన దంతేశ్వరరావుతో వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. పెళ్లి తర్వాత హరిణి గ్రూప్స్ (Groups) కోచింగ్ కోసం హైదరాబాద్ వెళ్లాక.. అక్కడ స్టడీ సెంటర్‌లో సుధానాగేంద్ర అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అతడిని పెళ్లి చేసుకుంటానని, భర్త నుండి విడాకులు కావాలని హరిణి పట్టుబట్టడంతో తల్లిదండ్రులతో గొడవలు జరిగాయి. ఈ క్రమంలో భర్తతో విడాకులు ఇప్పిస్తామని నమ్మించి మే 31న హరిణిని సొంతూరికి తీసుకొచ్చారు.

హత్యకు పక్కా స్కెచ్ వేసిన కుటుంబ సభ్యులు.. భర్తను కేసు నుంచి తప్పించేందుకు అతడిని ముందే సినిమాకు పంపించేశారు. ఆ రాత్రి మంచంపై నిద్రిస్తున్న హరిణి కాళ్లను కన్నతల్లి విజయకుమారి గట్టిగా పట్టుకోగా.. తాతయ్య దుంపల బలుసాకు ఇనుప రాడ్డుతో ఆమె తలపై గట్టిగా మోదాడు. కేకలు వేయకుండా నోరు నొక్కి కిరాతకంగా చంపేశారు. అనంతరం హరిణి గుండెపోటుతో చనిపోయిందని, ఆపై ఆత్మహత్యకు యత్నించిందని ఊరి జనాన్ని నమ్మించారు. ఎవరికీ అనుమానం రాకుండా అర్ధరాత్రి వేళ శ్మశానవాటికలో శవాన్ని దహనం చేసి ఆధారాలన్నీ పూర్తిగా చెరిపేశారు.

అయితే, హరిణి ఊరికి వచ్చే ముందే తన కుటుంబంపై అనుమానంతో ఒక రహస్య ‘సెల్ఫీ వీడియో’ను హైదరాబాద్‌లోని నాగేంద్రకు పంపింది. “నేను జూన్ 5 లోపు తిరిగి రాకపోతే పోలీసులను ఆశ్రయించు.” అని చెప్పింది. ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో నాగేంద్ర వెంటనే పోలీసుల ‘శక్తి టీమ్’ ను ఆశ్రయించారు. వారి ద్వారా జిల్లా పోలీసులకు సమాచారం అందడంతో టెక్కలి పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. వీఆర్వో రమేష్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. హరిణి తల్లి, తాతయ్య, భర్తను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. హత్యకు వాడిన ఇనుప రాడ్డు, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -