- Advertisement -

పబ్బులో మందుబాబుల బీభత్సం

- Advertisement -

విజ‌య‌వాడ పబ్బులో మందుబాబులు బీభత్సం సృష్టించారు. యానిమల్ క్లబ్‌లో తలెత్తిన ఓ వివాదం కత్తి పోట్ల వరకు వెళ్లింది. కత్తితో తరుణ్ అనే యువకుడిపై దాడికి పాల్పడ్డారు సస్పెక్ట్ షీటర్ సందీప్ అండ్ బ్యాచ్.

టీ20 మ్యాచ్ ఫైనల్ రోజున పబ్‌లో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది. తెల్లార్లు పబ్‌లో జరిగిన వివాదంలో తరుణ్‌పై కత్తితో దాడికి పాల్పడ్డారు షీటర్ సందీప్.
రౌడీ షీట్ మూసేసినా తీరు మారకపోవటంతో సందీప్‌పై సస్పెక్ట్ షీట్ తెరిచారు పోలీసులు.

తెల్లవార్లూ యువతీ యువకులు మద్యం సేవించటంతో లాఠీ ఛార్జ్ చేశారు పోలీసులు. మొత్తం ఐదుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు…పబ్ యాజమాన్యంపై చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -