- Advertisement -

ప్రియుడితో గొడ‌వ‌..బిల్డింగ్ పై నుంచి దూకేసింది!

- Advertisement -

ఢిల్లీలో సంచలనం కలిగించిన ఘటన చోటుచేసుకుంది. ప్రియుడితో కలిసి నగరంలోని ఓ హోటల్‌కు వచ్చిన 22 ఏళ్ల యువతి, పెళ్లి విషయమై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఆవేశానికి లోనైంది. వివాహంపై అభిప్రాయ భేదాలు తలెత్తడంతో గొడవ మరింత పెరిగినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో కోపంతో యువతి హోటల్ నాలుగో అంతస్తు పై నుంచి కిందకు దూకింది. అయితే అక్కడున్న స్థానికులు ఆమె దూకుతున్నట్లు గమనించి అప్రమత్తమయ్యారు. సమీపంలో ఉన్న టీవీ, ఫ్రిజ్‌ల కార్డ్‌బోర్డ్ బాక్స్‌లను వెంటనే కింద అడ్డుగా ఏర్పాటు చేశారు. యువతి నేరుగా ఆ బాక్స్‌లపై పడటంతో ప్రాణాపాయం తప్పింది.

ఈ సంఘటన మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. యువతి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -