గంజాయి కేసులో ఒక యువకుడు పోలీసులకు చిక్కినట్లే చిక్కి చాకచక్యంగా తప్పించుకున్నాడు. దీనిపై పోలీసుల మీద పలు విమర్శలు వచ్చాయి. దాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు.. అతన్ని వదలలేదు. వెంటాడి వెంటాడి చివరకు పట్టుకున్నారు. 4 రోజుల పాటు జరిగిన ఈ దొంగ పోలీసు ఆట ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ ఆట చివరకు ఆ యువకుడి గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ముగిసింది.
పోలీసులు వెతుకుతున్న గంజాయి దొంగ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లోనే తలదాచుకున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. శిరీష్ (21) అనే యువకుడు, అతని ఫ్రెండ్ హర్షద్‌తో కలసి గంజాయి స్మగ్లింగ్ కు పాలు పడుతున్నాడు.ఆల్టో కారులో వీళ్లిద్దరూ గంజాయి తరలిస్తున్న సమయంలో పోలీసులు వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.వారి దగ్గరి నుంచి 4200 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అయితే గంజాయి అక్రమ రవాణా కేసులో అరెస్ట్ అయిన వీరిని కోర్టులో ప్రవేశ పెట్టే సమయం ఆసన్నమైంది. కరోనా వైరస్ కారణంగా కోర్టులు కూడా ఆన్ లైన్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా అన్ని ఏర్పాటులు చేస్తున్న సమయంలో నిందితులు అదే అదునుగా భావించి అక్కడినుంచి పారిపోయారు. దీంతో పోలీసులు షాక్ అయ్యారు.
పోలీస్ స్టేషన్ నుంచి కేటుగాళ్లు పారిపోయారంటూ పెద్ద ఎత్తున్న ప్రచారం జరిగింది. పలువురు పలు విమర్శలు కూడా చేశారు.దాంతో మళ్లీ రంగంలోకి దిగిన పోలీసులు చివరకు వాళ్లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇలా స్టేషన్ నుంచి తప్పించుకున్నందుకు కూడా పలు కేసులను వీరిపై నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇద్దరమ్మాయిల ముద్దుల పెళ్లి.. షాకైన ఇరు కుటుంబ సభ్యులు!
ఆ హాట్ వీడియోలకు ఎందుకంత క్రేజ్..