Monday, June 17, 2024
- Advertisement -

చంద్రబాబు మౌనం..దానికి సంకేతమేనా?

- Advertisement -

ఏపీ ఎన్నికల పోలింగ్ తర్వాత టీడీపీ అగ్రనేతలెవరూ పెద్దగా స్పందించడం లేదు. అధికారం తమదంటే తమదని టీడీపీ కింది స్థాయి నేతలు చెబుతున్నా చంద్రబాబు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాత్రం మౌనమే దాల్చారు.

దీంతో కార్యకర్తల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. సాధారణంగా ఏ ఎన్నిక జరిగినా చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసి గెలుపు పైన ధీమా వ్యక్తం చేసేవారు.కానీ ఈసారి అలాంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం చంద్రబాబు,లోకేష్ విదేశాల్లో ఉండగా కనీసం పార్టీ ఏపీ అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు సైతం తమ గెలుపు ఖాయమంటూ ఒక్క సారి మీడియా ముందుకు రాలేదు.

ఇక ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసిన బీజేపీ,టీడీపీ,జనసేన నేతల నుండి ఎలాంటి ప్రకటన రాలేదు.దీంతో పైకి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న లోలోపల మాత్రం కూటమి నేతలు అంతర్మథనం పడుతున్నారు. ఏదిఏమైనా ఫలితాలు వస్తేనే ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారనే దానిపై స్పష్టత రానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -