ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ఎవరు ఊహించని విధంగా విజయాన్ని నమోదుచేసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అందని విధంగా టీడీపీ కూటమి 164 స్థానాల్లో గెలుపొందగా వైసీపీ 11 స్థానాల్లో గెలుపొందింది. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో కూటమి 21 స్థానాల్లో గెలుపొందగా వైసీపీ 4 చోట్ల విజయదుందుబి మోగించింది.
వైసీపీ గెలిచిన 11 స్థానాలను పరిశీలిస్తే పులివెందుల – జగన్, పుంగనూరు – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బద్వేల్ – దాసరి సుధ, మంత్రాలయం – బాలనాగిరెడ్డి,
ఆలూరు – బూసినే విరూపాక్షి, దర్శి – శివప్రసాద్, యర్రగొండపాలెం – తాటిపర్తి చంద్రశేఖర్, అరకు – రేగం మత్స్యలింగం, పాడేరు – మత్స్యరాస విశ్వేశ్వర రాజు, రాజంపేట – ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి, తంబళ్లపల్లి – పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి విజయం సాధించారు.
కడప, రాజంపేట, తిరుపతి, అరకు లోక్ సభ నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపొందింది. అరకు – గుమ్మ తనుజా రాణి,కడప – వైఎస్ అవినాశ్ రెడ్డి,తిరుపతి – గురుమూర్తి,రాజంపేట – మిథున్ రెడ్డి విజయం సాధించారు.
ఇక కూటమి పొత్తులో భాగంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాలకుగాను టీడీపీ 16, బీజేపీ 3, జనసేన 2 సీట్లను కైవసం చేసుకున్నాయి.
