కర్నూల్ నుండి వైసీపీ తరపున పోటీ చేస్తున్నానని తెలిపారు సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. తన పదవికి స్వచ్చంద విరమణ చేశారు ఇంతియాజ్. సెర్ప్ సీఈవోగా, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.
ఇక వైసీపీలో చేరిన అనంతరం మాట్లాడిన ఇంతియాజ్.. కర్నూలు నగరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని సీఎం జగన్ ఆదేశించారన్నారు. అసమానతలు లేని సమాజం కోసం ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. సీఎం జగన్ అందిస్తోన్న సంక్షేమ పాలనకు ఆకర్షితుడినై వైసీపీలో చేరానన్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు తన స్వస్థలం అని….అందుకే కర్నూల్ నుండి పోటీ చేస్తున్నానని తెలిపారు.
ఈసారి ఎన్నికల్లో ఎక్కడా తాను పోటీ చేయడం లేదని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ చెప్పారు. పార్టీ పరంగా తన సేవలను వినియోగించుకుంటారని.. తగిన ప్రాధాన్యం ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చినట్టు వెల్లడించారు.తనకు మంచి రాజకీయ భవిష్యత్తు కల్పిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి తెలిపారు.